Share News

Pawan Kalyan: అటవీ భూముల్ని రక్షించలేని అధికారులపై చర్యల

ABN , Publish Date - May 14 , 2025 | 03:57 AM

అటవీ భూముల ఆక్రమణపై పడ్డిరెడ్డి కుటుంబంపై విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుని, ఆక్రమణదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని స్పష్టంగా సూచించారు.

Pawan Kalyan: అటవీ భూముల్ని రక్షించలేని అధికారులపై చర్యల

పెద్దిరెడ్డి కుటుంబ ఆక్రమణలపై క్రిమినల్‌ కేసులు

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలు

అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుంచి అటవీ భూములను రక్షించలేని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు. విజిలెన్స్‌ డీజీ నివేదిక, సిఫారసులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లాలో అటవీ, ప్రభుత్వ, బుగ్గమఠం భూములను పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందన్న ఆరోపణలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ విచారణ జరిపి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో సంబంధిత శాఖల భూములు ఆక్రమణకు గురవుతుంటే రక్షించలేని వారిని బాధ్యుల్ని చేయాలని, ఆక్రమణ దారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సిఫారసు చేశారు. ఈ నివేదికను పవన్‌ పరిశీలించారు. విజిలెన్స్‌ డీజీ సిఫారసులకు అనుగుణంగా చర్యలకు ఉపక్రమించాలని స్పష్టం చేశారు. అలాగే.. అటవీ భూములు ఆక్రమించిన వారిపై క్రిమినల్‌ కేసులతో పాటు అటవీ, పర్యావరణ చట్టాలను అనుసరించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 03:57 AM