Share News

Pawan Kalyan: దక్షిణాది ఆలయ యాత్రకు పవన్‌

ABN , Publish Date - Feb 13 , 2025 | 03:53 AM

దక్షిణ భారతదేశ ఆలయాల యాత్రకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శ్రీకారం చుట్టారు. బుధవారం కేరళలోని చొట్టనిక్కర ప్రాంతంలోని అగస్త్య మహర్షి ఆలయాన్ని కుమారుడు అకిరానందన్‌తో కలిసి ఆయన సందర్శించారు. టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్‌సాయి వెంట ఉన్నారు. అగస్త్య ఆలయ ట్రస్ట్‌ బోర్డు అధ్యక్షుడు యోగిదాస్‌, ఇతర సభ్యులు... పవన్‌ కల్యాణ్‌కు స్వాగతం పలికారు. కేరళ సంప్రదాయాలతో ఆలయ పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

Pawan Kalyan: దక్షిణాది ఆలయ యాత్రకు పవన్‌

కేరళ అగస్త్య మహర్షి ఆలయంలో పూజలు

కుమారుడితో కలిసి మొక్కు సమర్పణ.. అక్కడి మహర్షి ఆశ్రమ సందర్శన

నడుంనొప్పితో బాధపడుతున్న పవన్‌.. ఆశ్రమంలో మూలికా వైద్యంపై ఆరా

దక్షిణాది యాత్ర నా వ్యక్తిగతం.. తమిళనాడులోని గుళ్లనూ సందర్శిస్తా: పవన్‌

అమరావతి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : దక్షిణ భారతదేశ ఆలయాల యాత్రకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శ్రీకారం చుట్టారు. బుధవారం కేరళలోని చొట్టనిక్కర ప్రాంతంలోని అగస్త్య మహర్షి ఆలయాన్ని కుమారుడు అకిరానందన్‌తో కలిసి ఆయన సందర్శించారు. టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్‌సాయి వెంట ఉన్నారు. అగస్త్య ఆలయ ట్రస్ట్‌ బోర్డు అధ్యక్షుడు యోగిదాస్‌, ఇతర సభ్యులు... పవన్‌ కల్యాణ్‌కు స్వాగతం పలికారు. కేరళ సంప్రదాయాలతో ఆలయ పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయనతో ఆలయంలో ప్రదక్షిణ చేశారు. అగస్త్య మహర్షికి సంప్రదాయబద్ధంగా మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో ఉన్న ఇతర మహా రుషుల ఆలయాలను కూడా పవన్‌ దర్శించుకున్నారు. ఆలయ ఆకృతిని, కట్టడాలను ఆసక్తిగా పరీక్షించారు. ప్రత్యేక పూజల అనంతరం అగస్త్య ఆశ్రమంలో కొద్దిసేపు గడిపారు. ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే మూలికలు, మొక్కల గురించి ఆశ్రమ వైద్యులు విష్ణుయోగి, మణియోగి...... ఆయనకు వివరించారు. అగస్త్య మహర్షి పురాణాల్లో, వేదాల్లో చెప్పినట్లుగా ముఖ్యమైన చికిత్సలకు మూలికలు ఎలా ఉపయోగపడతాయనేది ఆయన అడిగి తెలుసుకున్నారు. కలరి యుద్ధకళ గొప్పదనం గురించి, ఆశ్రమం ఆవరణలోని శివలింగం విశిష్ఠత గురించి పవన్‌ తెలుసుకున్నారు.

ghj.jpg


సుదీర్ఘంగా నడుం నొప్పి, స్పాండిలైటిస్‌ సమస్యలతో పవన్‌ కల్యాణ్‌ బాధపడుతున్నారు. వీటికి సంబంధించిన చికిత్స విధానాలను గురించి అగస్త్య ఆశ్రమ వైద్యులను పవన్‌ కల్యాణ్‌ అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో ప్రత్యేకంగా అందించే చికిత్సాలయాన్ని సందర్శించారు. ఆగస్త్య ఆశ్రమానికి సుదూర ప్రాంతాల నుంచి చికిత్స నిమిత్తం ప్రతి రోజు 200 మందికి పైగా వస్తుంటారని అక్కడ సిబ్బంది చెప్పారు. ఆయుర్వేదం మనిషిపై ప్రభావం చూపడానికి కాస్త సమయం పట్టినా, దీర్ఘకాలంలో ఆరోగ్యానికి మంచిదని వైద్యులు వివరించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అగస్త్య మహర్షి వేదాల్లో వివరించిన చికిత్స పద్ధతులు, సంప్రదాయాల గురించి ఆయనకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన అనేది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. రాజకీయాలకు సంబంధం లేదు. సుమారు నాలుగున్నర సంవత్సరాల క్రితం చెల్లించుకోవలసిన మొక్కుల నిమిత్తం, నా ఆరోగ్యం అంతగా సహకరించకున్నా రావాల్సి వచ్చింది. కేరళతోపాటు తమిళనాడులో ఉన్న ఆలయాలను కూడా దర్శించుకుంటాను.’’ అని పవన్‌ తెలిపారు. ఎర్రచందనం అమ్మకాల విషయంలో నూతన విధానం తీసుకురావాలని కేంద్రాన్ని కోరామని డిప్యూటీ సీఎం అన్నారు.


తిరుమల భక్తుల మనోభావాలు కాపాడాలి

తిరుమలకు వచ్చే భక్తుల మనోభావాలను కాపాడటం అందరి బాధ్యత అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తిరుమల లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ అయినట్టు సీబీఐ దర్యాప్తులో తేలడం దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు మళ్లీ భవిష్యత్తులో జరగకుండా టీటీడీ పాలకవర్గం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నెయ్యి కల్తీ వ్యవహారంపై దర్యాప్తులో మంచి పురోగతి ఉండటం, దోషులను అరెస్టు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..

Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం

Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి

Also Read: మరోసారి కుల గణన సర్వే

Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు

Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 13 , 2025 | 03:53 AM