Share News

Pithapuram Development: శాంతిభద్రతల్లో రాజీపడం

ABN , Publish Date - Apr 26 , 2025 | 04:08 AM

పిఠాపురంలో శంకుస్థాపనలు, అభివృద్ధి పనులతో పర్యటించిన పవన్‌ కల్యాణ్‌, శాంతిభద్రతల విషయంలో రాజీపడమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వర్మ, ఎస్పీ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

Pithapuram Development: శాంతిభద్రతల్లో రాజీపడం

తప్పుచేస్తే ఏ పార్టీ వారైనా ఉపేక్షించేది లేదు

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హెచ్చరిక

పిఠాపురం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

పది నెలల్లో 100 కోట్లతో పనులు చేపట్టామని వెల్లడి

కాకినాడ, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతలను కాపాడే విషయంలో కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీపడబోదని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. తప్పుచేస్తే ఏ పార్టీ వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్‌ శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. తొలుత యు.కొత్తపల్లి మండలానికి చేరుకుని టీటీడీ కల్యాణ మండపం నిర్మాణానికి, అక్కడినుంచే గొల్లప్రోలు, చేబ్రోలు సీతారామస్వామి దేవస్థానాల్లో ప్రాకారమండపం,కాలక్షేప మండపం, రథశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పిఠాపురం 30 పడకల ప్రభుత్వాస్పత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేస్తూ చేపట్టనున్న ఆస్పత్రి భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పూజా ప్రదేశంలో ఇటుకలపై సిమెంట్‌ వేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పిఠాపురం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వివరించారు.

h.jpg

గత పది నెలల్లో నియోజకవర్గంలో రూ.100 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని తెలిపారు. పిఠాపురం ఆర్వోబీ నిర్మాణానికి త్వరలోనే టెండర్ల ప్రక్రియ మొదలవుతుందని ప్రకటించారు. గొల్లప్రోలు సీతారామస్వామి దేవస్థానంలో రూ.1.32 కోట్లతో ప్రాకార మండపం నిర్మిస్తున్నామని వివరించారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ, వర్మ, జనసేన నేతలంతా కలిసి పనిచేస్తామని చెప్పారు. అంతకుముందు 8.64 కోట్లతో ఉచిత దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించారు.


వర్మ, ఎస్పీ మధ్య వాగ్వాదం

పవన్‌ కల్యాణ్‌ పర్యటన సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వర్మ, ఎస్పీ బిందుమాధవ్‌కు మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగింది. పర్యటన సందర్భంగా పవన్‌ అంబేడ్కర్‌ కమ్యూనిటీ హాల్‌ వద్దకు రానుండగా.. అప్పటికే అక్కడ ఉన్న వర్మతోపాటు టీడీపీ నేతలను అక్కడి నుంచి దూరంగా వెళ్లాలని ఎస్పీ సూచించారు. దీంతో వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొమ్మంటే వెళ్లిపోతామని హెచ్చరించారు. దీంతో ఎస్పీ ఆయనను సముదాయించారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 04:08 AM