మఠం భూమిలో పట్టాలు ఇవ్వాలి
ABN , Publish Date - Jan 04 , 2025 | 11:46 PM
కూటమి నాయకులు ఎన్నికల ముం దు అర్హులైన పేదలకు మఠం భూమిలో పట్టాలు ఇస్తామని హామీ ఇ చ్చారని, ఆ హామీని నెరవేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ డిమాండ్ చేశారు.

బత్తలపల్లి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): కూటమి నాయకులు ఎన్నికల ముం దు అర్హులైన పేదలకు మఠం భూమిలో పట్టాలు ఇస్తామని హామీ ఇ చ్చారని, ఆ హామీని నెరవేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బత్తలపల్లిలో శనివారం ఆ పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసనలో వేమయ్య మాట్లాడారు. బత్తలపల్లిలో మఠం భూమిని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు కబ్జాకు యత్నిం చారని, ఆ భూమిని అక్రమార్కుల పరం కాకుండా పేదలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. అనంతరం డీటీ రామకృష్ణకు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో మధు, కాటమయ్య, ఆంజినేయులు పాల్గొన్నారు.