గత ఐదేళ్లూ పశుసంవర్ధక శాఖకు తాళాలు: అచ్చెన్న
ABN , Publish Date - Sep 20 , 2025 | 07:16 AM
గత ప్రభుత్వం ఐదేళ్లూ రాష్ట్రంలో పశుసంవర్థకశాఖకు తాళాలు వేసేసిందని ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పశువులకు దాణా పంపిణీ, వ్యాక్సినేషన్ కూడా ఆపేశారని విమర్శించారు.
ఇంటర్నెట్ డెస్క్: గత ప్రభుత్వం ఐదేళ్లూ రాష్ట్రంలో పశుసంవర్థకశాఖకు తాళాలు వేసేసిందని ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పశువులకు దాణా పంపిణీ, వ్యాక్సినేషన్ కూడా ఆపేశారని విమర్శించారు. రాష్ట్రంలో పశువైద్యులు, పశువైద్య సహాయకుల ఖాళీలను భర్తీ చేయని కారణంగా పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు, పశువుల ఆస్పత్రుల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, తమ నియోజకవర్గంలో గేదెలు వింత వ్యాధితో చనిపోతున్నాయంటూ కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావులు శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సమాధానమిస్తూ గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్లలో ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని చెప్పారు. అయినప్పగ్రామస్థాయిలో ఉన్న 6,137 మంది వెటర్నరీ అసిస్టెంట్ల ద్వారా పశువులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఆస్పత్రు ల భవనాల మరమ్మతులు చేయిస్తామన్నారు.