Papavinashanam Dam : పాపవినాశనం డ్యాం గేట్లలో కొన్ని భాగాలు దెబ్బతిన్నాయ్!
ABN , Publish Date - Feb 14 , 2025 | 06:20 AM
తిరుమలలోని అతిపెద్ద జలాశయం పాపవినాశనం గేట్లలో కొన్ని భాగాలు దెబ్బతిన్నాయని రాష్ట్ర జనవరులశాఖ సలహాదారు, ప్రముఖ విశ్రాంత ఇంజనీర్ కన్నయ్యనాయుడు తెలిపారు. ఆయన తన బృందంతో కలిసి గురువారం పాపవినాశనం, గోగర్భం

కొత్త వాటికి డిజైన్ చేస్తున్నాం
ప్రభుత్వ సలహాదారు కన్నయ్యనాయుడి వెల్లడి
తిరుమల, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): తిరుమలలోని అతిపెద్ద జలాశయం పాపవినాశనం గేట్లలో కొన్ని భాగాలు దెబ్బతిన్నాయని రాష్ట్ర జనవరులశాఖ సలహాదారు, ప్రముఖ విశ్రాంత ఇంజనీర్ కన్నయ్యనాయుడు తెలిపారు. ఆయన తన బృందంతో కలిసి గురువారం పాపవినాశనం, గోగర్భం డ్యాములు పరిశీలించారు. అనంతరం ఆయన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘పాపవినాశనం డ్యాం గేట్లలో కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతమున్న గేట్లు మరో రెండేళ్లు గట్టిగానే ఉంటాయి. ఈలోపే 6.1 మీటర్లు వెడల్పు, 6.8 మీటర్లు ఎత్తుతో కొత్త గేట్ల డిజైన్‌కు ప్లాన్ చేస్తున్నాం. అన్నీ పూర్తయితే మరో 30 ఏళ్లు డ్యాం పటిష్ఠంగా ఉంటుంది. గడ్డర్‌లో ఉన్న లీకేజీలను కూడా అడ్డుకోవాలి’ అని వివరించారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల డ్యాంనూ పరిశీలించామని.. అందులో కూడా చాలా మరమ్మతులు చేయాల్సిన అవసరముందని కన్నయ్యనాయుడు తెలిపారు.