Share News

ప్రత్యేక తరగతులకు అరకొర స్పందన

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:24 AM

మండలంలో పదోతరగతి విద్యార్థులకు జిల్లా పరిషత పాఠశాలల్లో ప్రభుత్వం తలపెట్టిన ప్రత్యేక తరగతులకు ఆదివారం అరకొర స్పందన లభించింది

ప్రత్యేక తరగతులకు అరకొర స్పందన
గాండ్లపెంట: ప్రత్యేక తరగతులకు హాజరైన విద్యార్థులు

గాండ్లపెంట, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): మండలంలో పదోతరగతి విద్యార్థులకు జిల్లా పరిషత పాఠశాలల్లో ప్రభుత్వం తలపెట్టిన ప్రత్యేక తరగతులకు ఆదివారం అరకొర స్పందన లభించింది. కటారుపల్లి, రెక్కమాను, గాండ్లపెంట, తుమ్మలబైలు, నీరుకుంట్లపల్లి పాఠశాలల్లో పది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. హాజరైన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వసతినీ కల్పించారు. అయినా ఈ తరగతుల పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపలేదు. ఆయా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులను ప్రత్యేక తరగతులకు పంపడానికి తల్లిదండ్రులు సహకరించాలని, అప్పుడే మంచి మార్కులతోపాటు ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని సూచించారు.

Updated Date - Feb 03 , 2025 | 12:24 AM