Panchumarthi Anuradha : పగలు పూజలు.. రాత్రి దోపిడీలు
ABN , Publish Date - Jan 31 , 2025 | 06:15 AM
రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు జగన్ అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతడిని మించినవాడని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు.

ఇదీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నైజం: పంచుమర్తి అనురాధ
అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు జగన్ అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతడిని మించినవాడని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పెద్దిరెడ్డి పగలేమో పూజలు.. రాత్రంతా దోపిడీలు చేస్తుంటాడని.. అది అతని నైజమన్నారు. పెద్దిరెడ్డి పాపాలపై ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుందన్నారు.