Paidimamba Sirimanotsavam: అక్టోబరు 7న పైడిమాంబ సిరిమానోత్సవం
ABN , Publish Date - Aug 14 , 2025 | 05:40 AM
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, విజయనగరంలో కొలువైన పైడిమాంబ సిరిమానోత్సవం అక్టోబరు..
విజయనగరం రూరల్, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, విజయనగరంలో కొలువైన పైడిమాంబ సిరిమానోత్సవం అక్టోబరు 7న నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శీరిష, పూజారి బంటుపల్లి వెంకటరమణ తెలిపారు. దేవస్థానం కార్యాలయంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ...అక్టోబరు 6న తొలేళ్ల ఉత్సవం నిర్వహిస్తామన్నారు. అమ్మవారి పండగకు సంబంధించి సెప్టెంబరు 12న పందిరిరాట వేస్తామని, అదే రోజు భక్తుల మండల దీక్షలు ప్రారంభమవుతాయన్నారు. సిరిమానోత్సవ కార్యక్రమాలు అక్టోబరు 22న జరిగే చండీహోమంతో ముగుస్తాయన్నారు. పండగ షెడ్యూల్‌ను ఈవో శీరిష, వెంకటరావు, దేవాలయ అర్చకులు, ఉద్యోగులు ఆవిష్కరించారు.