సనాతనధర్మం కోసం పాదయాత్ర
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:47 PM
సనాతన ధర్మం, హిందూవుల్లో ఐక్యత కోసం హిందూపురం రూరల్ మండలంలోని లిం గంపల్లి నుంచి కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు 160 మంది భక్తులు పాద్రయాత్ర చేపట్టారు.

ఓబుళదేవరచెరువు, జనవరి 25(ఆంధ్రజ్యోతి): సనాతన ధర్మం, హిందూవుల్లో ఐక్యత కోసం హిందూపురం రూరల్ మండలంలోని లిం గంపల్లి నుంచి కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు 160 మంది భక్తులు పాద్రయాత్ర చేపట్టారు. శనివారం ఈ పాద యాత్ర ఓడీసీకి చేసుకుంది. వారు మాట్లాడుతూ లింగంపల్లి లక్ష్మీ నర సింహస్వామి కమిటీ కార్యదర్శి టీచర్ జయన్న ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పాతయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు.గురువారం లింగం పల్లివద్ద ఈ పాదయాత్ర ప్రారంభించామని, శనివారం సాయం త్రానికి కదిరి చేసుకొని.. స్వామివారిని దర్శించుకుం టుమన్నారు. 110కి లోమీటర్ల పాదయాత్ర చేపట్టమని చెప్పారు.