Share News

Overseas Worker: సొంత ఊరి కోసం ప్రవాసీయుడి వితరణ

ABN , Publish Date - Jul 09 , 2025 | 06:43 AM

పొట్ట చేతబట్టుకుని ప్రవాసం పోయినా ఉన్న ఊరి గురించి... అక్కడి అన్నదాతల అగచాట్ల గురించి ఆలోచించడం మానలేదాయన! ఉపాధి కోసం గల్ఫ్‌ వచ్చినా సొంత ఊరిలో ఉన్న తన సాగు భూమి...

Overseas Worker: సొంత ఊరి కోసం ప్రవాసీయుడి వితరణ

  • అన్నదాతల కోసం బోరు బావి ఏర్పాటు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

పొట్ట చేతబట్టుకుని ప్రవాసం పోయినా ఉన్న ఊరి గురించి... అక్కడి అన్నదాతల అగచాట్ల గురించి ఆలోచించడం మానలేదాయన! ఉపాధి కోసం గల్ఫ్‌ వచ్చినా సొంత ఊరిలో ఉన్న తన సాగు భూమి... దాని చుట్టుపక్కల ఉన్న రైతుల వ్యవసాయ అవసరాల కోసం తనవంతు ఏదైనా చేయాలని తలపోశాడు. భూగర్భ జలాలు అడుగంటిపోయి సొంత ఊరి రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని సొంత ఖర్చుతో బోరు బావిని తవ్వించాడు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రుకు చెందిన పామిరెడ్డి రామిరెడ్డి ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ చేసి గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. తన సొంత ఊరి లో భూగర్భ జలాలు అడుగంటిపోతుండడం రామిరెడ్డిని కలవరపరిచింది. అక్కడి రైతుల ఇబ్బందులు కొంతైనా తీర్చాలని సొంత ఖర్చుతో ఒక బోరుబావిని తవ్వించాడు. దీంతో తన భూమితోపాటు చుట్టుపక్కల ఉన్న ఎనిమిది మంది సన్నకారు రైతుల సాగునీటి అగచాట్లు తీరాయి. తమకు వారసత్వంగా వచ్చిన భూమితో పాటు చుట్టుపక్కల పొలాలకు సాగునీరు అందుబాటులో లేకపోవడంతో వర్షాధారిత పంటలు మాత్రమే సాగు చేయాల్సి వస్తుందని అందుకే తన వంతుగా బోరు బావి తవ్వించానని రామిరెడ్డి తెలిపారు.

Updated Date - Jul 09 , 2025 | 06:46 AM