ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోకి.. బయట ఆహారం నిషేధం
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:45 AM
నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థులకు బయట నుంచి వస్తున్న ఆహార పదార్థాలను నెలపాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్జీయూ కేటీ రిజిస్ర్టార్, నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఎస్.అమరేంద్ర కుమార్ తెలిపారు.

ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ అమరేంద్రకుమార్
నూజివీడు టౌన్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థులకు బయట నుంచి వస్తున్న ఆహార పదార్థాలను నెలపాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్జీయూ కేటీ రిజిస్ర్టార్, నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఎస్.అమరేంద్ర కుమార్ తెలిపారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో కొద్దికాలంగా విద్యార్థులు బయట ఆహారం వల్ల అస్వస్థతకు గురవుతున్నట్టు గమనించామన్నారు. ఈ నేపథ్యంలో నెలరోజుల పాటు క్యాంపస్ బయట నుంచి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకురాకూడదని, విద్యార్థులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. తల్లిదండ్రులు క్యాంపస్‌కు వచ్చేటప్పుడు ఇంటివద్ద నుంచి ఆహార పదార్థాలు తీసుకురావచ్చని తెలిపారు. గతంలో ట్రిపుల్ ఐటీలోకి బయటనుంచి ఆహార పదార్థాలు తీసుకొచ్చే పరిస్థితి లేదని, అయితే గత ఆరునెలల క్రితం ట్రిపుల్ ఐటీలో ఆహార నాణ్యతపై ఆరోపణలు రావడంతో బయట నుంచి ఆహారం తీసుకొచ్చేందుకు అనుమతి ఇచ్చినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం దీనిని నిషేధించినట్టు తెలిపారు.