Share News

సేంద్రియ ఎరువులు వాడాలి

ABN , Publish Date - Sep 10 , 2025 | 10:54 PM

రైతన్నలు పంటలకు సేంద్రియ ఎరువు లు వాడేలా ప్రణాళిక సిద్దం చేసుకోవాలని జిల్లా వ్యవసా యాధికారి శివనారాయణ పేర్కొన్నారు. తరిగొండలో యూరియా వాడకంపై రైతు లకు ఆయన అవగాహన క ల్పించారు. పంటలకు సేంద్రి య ఎరువులు వినియోగిం చాలన్నారు. రైతులు ప్రకృతి వ్యవసా యంపై మొగ్గు చూపాలన్నారు. ఇందు కు పచ్చిరొట్ట ఎరువులు, జనుము, జీలు గ వాడాలన్నారు.

సేంద్రియ ఎరువులు వాడాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీఏఓ శివనారాయణ

నానో యూరియాపై అవగాహన పెంచుకోవాలి

అధిక యూరియా వినియోగంతో అనర్థాలే

రైతులకు జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ సూచన

గుర్రంకొండ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రైతన్నలు పంటలకు సేంద్రియ ఎరువు లు వాడేలా ప్రణాళిక సిద్దం చేసుకోవాలని జిల్లా వ్యవసా యాధికారి శివనారాయణ పేర్కొన్నారు. తరిగొండలో యూరియా వాడకంపై రైతు లకు ఆయన అవగాహన క ల్పించారు. పంటలకు సేంద్రి య ఎరువులు వినియోగిం చాలన్నారు. రైతులు ప్రకృతి వ్యవసా యంపై మొగ్గు చూపాలన్నారు. ఇందు కు పచ్చిరొట్ట ఎరువులు, జనుము, జీలు గ వాడాలన్నారు. వరి నాటే ముందు కానుగ, వేప ఆకులు వేసి కలియదున్ని పంట సాగు చేస్తే మంచి దిగుబడి వ స్తుందన్నారు. అధిక మోతాదులో యూ రియా వాడకంతో భూసారం తగ్గి పంట దిగుబడి తగ్గుతుందన్నారు. మండల రైతులకు యూరియా అందజేస్తున్నట్లు చెప్పారు. ఏడీఏ నాగ ప్రసాద్‌, ఏఓ రత్నమ్మ, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

నానో యూరియాను వాడాలి

పీలేరు, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): రైతులు నానో యూరియాను ఉపయో గించుకోవాలని కేవీపల్లె తహసీల్దారు నరేంద్ర సూచించారు. మహల్‌రాజుపల్లె, తిమ్మాపురం రైతు సేవా కేంద్రాల్లో నానో యూరియా, నానో డీఏపీ వాడకంపై బుధవారం రైతులకు అవగాహన కల్పిం చారు.


ఎకరాకు అర లీటరు నానో యూ రియా మాత్రమే స్ర్పే చేయాలని, దాని ధర కేవలం రూ.220లు మాత్రమేనన్నా రు. ఎకరాకు అర లీటరు డీఏపీ స్ర్పే చేసుకోవచ్చని, రూ.250లు మాత్రమేనన్నారు. వ్యవసా య అధికారి మాధవి, ఏఈ ఓ అనిత, తిమ్మాపురం సర్పంచ్‌ రెడ్డప్ప పాల్గొన్నారు.

అధిక యూరియా వినియోగంతో అనర్థాలే

మదనపల్లె టౌన్‌, సెప్టెంబ రు 10 (ఆంధ్రజ్యోతి): పంటసాగులో రైతులు ఎక్కువ శాతం యూరియా వినియో గించడం వలన అనర్థాలు ఎక్కువని వ్యవసాయశాఖ ఏఓ నవీన్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. చీకిలబైలు, వేంపల్లె, అంకి శెట్టిపల్లె రైతు సేవా కేంద్రాల్లో తహసీ ల్దార్‌ కిశోర్‌కుమార్‌, ఎంపీడీఓ తాజ్‌ మ స్రూర్‌తో కలిసి ఆర్గానిక్‌ ఎరువుల వాడ కంతో కలిగే ఉపయోగాలు వివరించా రు. ఎక్కువ మోతాదులో యూరియా వాడితే భూసారం తగ్గుతుందన్నారు. టీడీపీ ఇన్‌చార్జి జంగాల రమణ, జెడ్‌బీఎన్‌ఎఫ్‌ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 10:54 PM