Share News

Animal Breeding : నాటు ఆవుకు పుంగనూరు జత

ABN , Publish Date - Jan 17 , 2025 | 04:40 AM

ఒంగోలు జాతి నాటు ఆవుకు పుంగనూరు జాతి ఎద్దు వీర్యంతో జత కట్టించగా.. 80 శాతం పుంగనూరు జాతి పోలికలున్న కోడెదూడ పుట్టింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని శ్రీపురంధరపురం (శ్రీహరికోట) గ్రామానికి చెందిన రైతు ఆవుల మల్లికార్జునరెడ్డి కుమారుడు మణిదీ్‌పరెడ్డి రెండేళ్ల

Animal Breeding : నాటు ఆవుకు పుంగనూరు జత

బుచ్చిరెడ్డిపాళెం, జనవరి 16: ఒంగోలు జాతి నాటు ఆవుకు పుంగనూరు జాతి ఎద్దు వీర్యంతో జత కట్టించగా.. 80 శాతం పుంగనూరు జాతి పోలికలున్న కోడెదూడ పుట్టింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని శ్రీపురంధరపురం (శ్రీహరికోట) గ్రామానికి చెందిన రైతు ఆవుల మల్లికార్జునరెడ్డి కుమారుడు మణిదీ్‌పరెడ్డి రెండేళ్ల క్రితం రాజమండ్రి నుంచి ఒంగోలు జాతి నాటు ఆవుకు పుంగనూరు జాతి ఎద్దుతో జతకట్టించగా పుట్టిన పెయ్యి దూడను రూ.35 వేలకు కొనుగోలు చేసి గంగ అని పేరుపెట్టారు. దానికి కూడా పుంగనూరు జాతి వీర్యంతో జతకట్టించగా మళ్లీ పెయ్యిదూడ పుట్టింది కానీ, ఆ లక్షణాలు రాలేదు. గతేడాది మార్చిలో పుంగనూరు ఎద్దు వీర్యంతో గర్భం దాల్చగా... ఇటీవల సుమారు 80 శాతం పోలికలున్న పుంగనూరు కోడెదూడకు జన్మనిచ్చిందని రైతు తెలిపారు. ఇది 16.72 అంగుళాలు ఎత్తు, 22 అంగుళాల పొడవు, 8 కిలోల బరువు ఉందని చెప్పారు. మరో రెండు ఈతలకు 100 శాతం లక్షణాలుండే పుంగనూరు దూడ కచ్చితంగా పుడుతుందని మణిదీ్‌పరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - Jan 17 , 2025 | 04:40 AM