Share News

TDP Mahanadu: రెండో రోజు.. లక్ష మందికి..

ABN , Publish Date - May 29 , 2025 | 05:02 AM

కడప మహానాడులో రెండోరోజు లక్ష మందికి భోజన వసతి కల్పించి, ఎన్టీఆర్‌ ఇష్టమైన స్వీట్లతోపాటు రాయలసీమ ప్రత్యేకతలతో భోజనాలు అందించారు. ప్రతినిధుల రద్దీ వల్ల కొంత రధ్దీ ఉన్నా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అందరికీ భోజనం ఏర్పాటు చేశారు.

TDP Mahanadu: రెండో రోజు.. లక్ష మందికి..

‘మహానాడు’లో ఎన్టీఆర్‌కు ఇష్టమైన వంటకాలు

వెజ్‌, చికెన్‌, మటన్‌తో భోజనాలు

కడప రూరల్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): కడప గడ్డపై జరుగుతున్న మహానాడులో రెండో రోజు బుధవారం 3 పూటలకు కలిపి లక్ష మందికి భోజన వసతి కల్పించారు. రాయలసీమ రుచులతో పాటు టీడీపీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత... దివంగత ఎన్టీ రామారావుకు ఇష్టమైన నేతితో తయారు చేసిన స్వీట్లతో పాటు చక్కెర పొంగలి, వెజిటబుల్‌ పలావ్‌, చికెన్‌, మటన్‌ ఐటమ్స్‌తో భోజనాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజులా కాకుండా రెండో రోజు ఉదయం 11 గంటల నుంచే భోజనాలను ప్రారంభించారు. దీంతో భోజనం చేయదలుచుకున్న వారు ప్రతినిధుల సభ నుంచి అప్పుడప్పుడూ కొద్దికొద్దిగా వచ్చి భోజనం చేసి తిరిగి సభకు హాజరయ్యారు. స్టేజి సభ్యుల (వీవీఐపీ) భోజనశాల, వీఐపీ భోజనశాల, మీడియా భోజనశాల సాఫీగా కొనసాగింది. వేర్వేరుగా రెండు చోట్ల ఏర్పాటు చేసిన ప్రతినిధుల భోజనశాలలో మాత్రం కాస్త రద్దీగా కనిపించింది. రెండోరోజు సభకు లెక్కకు మించి ప్రతినిధులు హాజరయ్యారు. ఇందుకు తగ్గట్టుగా కౌంటర్లను పెంచకపోవడంతో కాస్త ఇబ్బందులకు లోనయ్యారు. అయినప్పటికీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అందరికీ భోజనం అందించగలిగారు. లెక్కకు మించి ప్రతినిధులు హాజరవుతారని తాము ముందుగానే ఉహించి భోజనాలను సిద్ధం చేసినట్లు వంట కాంట్రాక్టర్‌ కిలారు వెంకటశివాజీ తెలిపారు. ఉదయం అల్పాహారంలో స్వీట్‌తో కేసరి, టమాటా బాత్‌, ఉప్మా, ఇడ్లీ, వడ, సాంబారు, పల్లీ చట్నీ, టమాటా చట్నీలను అందించామన్నారు.


Also Read:

మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు

బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్

For More Telugu And National News

Updated Date - May 30 , 2025 | 03:00 PM