బావిలో దూకి ఒకరు.. రక్షించేందుకు వెళ్లి మరొకరు
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:43 PM
బావిలో దూకిన మహిళతో సహా కాపాడడానికి వెళ్లిన వ్యక్తి కూడా మృత్యుతవాత పడ్డాడు.

80బన్నూరు పొలిమేరలోని బావిలో పడి ఇద్దరి మృతి
తుమ్మలూరులో విషాదం
జూపాడుబంగ్లా, పాములపాడు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): బావిలో దూకిన మహిళతో సహా కాపాడడానికి వెళ్లిన వ్యక్తి కూడా మృత్యుతవాత పడ్డాడు. ఈ ఘటన సోమవారం మండలంలోని 80బన్నూరు గ్రామ పొలిమేరలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. తుమ్మలూరు గ్రామానికి చెందిన లక్ష్మీదేవి(48) కొన్నేళ్ల నుంచి కాన్సర్‌తో బాధ పడుతోంది. వైద్య ఖర్చులు పెరిగిపోవడంతో మనస్థాపానికి గురై 80బన్నూరు సోమవారం గ్రామ పొలిమేరలో ఉన్న బావిలో దూకింది. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన తెలుగు లక్ష్మీనారాయణ(44) ఆమెను రక్షించేందుకు బావిలోకి దూకాడు. ఆమెను కాపాడే ప్రయత్నంలో అతను కూడా మృతి చెందాడు. లక్ష్మీనారాయణ మృతదేహం లభ్యం కావడంతో నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం చేయించారు. మహిళ మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. ఇరువురు మృతి చెందడంతో తుమ్మలూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.