Share News

92 ఏళ్ల మధుర స్మృతులు

ABN , Publish Date - Feb 24 , 2025 | 01:08 AM

ఒక బ్యాచ్‌ కాదు..రెండు బ్యాచ్‌లు కాదు 1932 నుంచీ 2024 వరకు 92 సంవత్సరాల చల్లపల్లి రాజా హైస్కూల్‌, కళాశాల పూర్వవిద్యార్థుల ఆత్మీయ, అపూర్వ కలయిక ఆదివారం ప్రవాస భారతీయులు మండవ శేషగిరిరా వు, విశ్రాంత ఆర్టీవో నాదెళ్ల శివరామకృష్ణ ఆధ్వర్యం లో సందడిగా జరిగింది. ముందుగా చల్లపల్లి రాజా, సర్వేపల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దాలిర్రు నుంచి వచ్చి చదువుకున్న 1948 బ్యాచ్‌కు చెందిన బొందలపాటి వెంకటేశ్వరరావు (90)తోపాటు గత బ్యాచ్‌ వరకు పలు బ్యాచ్‌ల పూర్వవిద్యార్థులు తరలిరావటంతో కళాశాల సందడిగా మారింది.

92 ఏళ్ల మధుర స్మృతులు

చల్లపల్లి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : ఒక బ్యాచ్‌ కాదు..రెండు బ్యాచ్‌లు కాదు 1932 నుంచీ 2024 వరకు 92 సంవత్సరాల చల్లపల్లి రాజా హైస్కూల్‌, కళాశాల పూర్వవిద్యార్థుల ఆత్మీయ, అపూర్వ కలయిక ఆదివారం ప్రవాస భారతీయులు మండవ శేషగిరిరా వు, విశ్రాంత ఆర్టీవో నాదెళ్ల శివరామకృష్ణ ఆధ్వర్యం లో సందడిగా జరిగింది. ముందుగా చల్లపల్లి రాజా, సర్వేపల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దాలిర్రు నుంచి వచ్చి చదువుకున్న 1948 బ్యాచ్‌కు చెందిన బొందలపాటి వెంకటేశ్వరరావు (90)తోపాటు గత బ్యాచ్‌ వరకు పలు బ్యాచ్‌ల పూర్వవిద్యార్థులు తరలిరావటంతో కళాశాల సందడిగా మారింది. సుమారు 1500 మంది పూర్వవిద్యార్థులు కళాశాలకు వచ్చి చదువుకున్ననాటి తీపి జ్ఞాపకాలను, మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు. గురువులను సన్మానించి, ఆశీర్వాదం తీసుకున్నారు. తరగతి గదులకు వెళ్లి కూర్చుని నాటి విశేషాలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. కలిసి భోజనాలు చేసి కబుర్లు చెప్పుకున్నారు. బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా గ్రూపు ఫొటోలు దిగారు. మా తుజే సలామ్‌, శివతాండవం, కోలాటం, డప్పు ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహణకు చొరవ చూపిన ఎన్నారై మండవ శేషగిరిరావు, విశ్రాంత ఆర్టీవో నాదెళ్ల శివరామకృష్ణలను పూర్వవిద్యార్థులు ఘనంగా సత్కరించారు.

గురువులకు సన్మానం

గురువులు నల్లూరి రామారావు, టి.సాంబశివరావు, పి.ప్రభాకరరావు, రాయపాటి ప్రసాదరావు, సీతారామస్వామి, సిబ్బంది బండి లీలావతి, రాఘవయ్యలను ఘనంగా సన్మానించారు. వివిధ రంగాల ప్రముఖులు మత్తి వెంకటేశ్వరరావు, గొర్రెపాటి వెంకట రామకృష్ణ, కొర్రపాటి కృష్ణప్రసాద్‌, గొరిపర్తి నిఖిలేష్‌, వడ్లమూడి రంగారావు, గరిమెళ్ల విజయలక్ష్మి, నెరుసు కృష్ణాంజనేయులు, నాదెళ్ల రాధాకృష్ణ తదితరులు ప్రసంగించారు. గుత్తికొండ కోటేశ్వరరావు, విజయలక్ష్మి, మల్లుపెద్ది రాణీకుమారి, మేకా శివనాగేశ్వరరావు, సజ్జా చలపతిరావు, కోనేరు కరుణాకర్‌, దోనేపూడి శంకర్‌, బొందలపాటి మురళి తదితరులు పర్యవేక్షించారు.

Updated Date - Feb 24 , 2025 | 01:08 AM