వెంకన్నకు వేడుకగా పవిత్రాల సమర్పణ
ABN , Publish Date - Sep 04 , 2025 | 10:51 PM
కోసువారిపల్లెలో కొలువైన ప్రసన్న వేంకట రమణ స్వామి ఆలయ వార్షిక పవిత్రోత్సవాల్లో మూడో రోజు టీటీడీ ఆధ్వర్యంలో పవి త్రాల సమర్పణ వేడుకగా నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి అభిషేకం, ధూపదీప నైవేద్యాలు పూర్తిచేశారు.
తంబళ్లపల్లె, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): కోసువారిపల్లెలో కొలువైన ప్రసన్న వేంకట రమణ స్వామి ఆలయ వార్షిక పవిత్రోత్సవాల్లో మూడో రోజు టీటీడీ ఆధ్వర్యంలో పవి త్రాల సమర్పణ వేడుకగా నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి అభిషేకం, ధూపదీప నైవేద్యాలు పూర్తిచేశారు. అనం తరం వేదపండితులు పట్టు పవిత్రాలను మంగళవాయిద్యాలతో ఆలయంలో ఊరేగిం పుగా తీసుకువెళ్లి స్వామి వారి మెడలో, శ్రీదేవి, భూదేవిలకు, ధ్వజస్తంభానికి, ప్రసన్న ఆంజనేయస్వామి వారికి, ఆలయం వెలుపల 12 మంది మూలవర్లకు సమర్పించా రు. శుక్రవారం చతుష్టానార్చన, మహాపూర్ణాహుతి, కుంభప్రోక్షణ, పవిత్ర విసర్జన, స్నపనతిరుమంజనం, పవిత్ర వితరణ, చక్రస్నానం సాయంత్రం వీధి ఉత్సవంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. డిప్యూటీ ఈఓలు వరలక్ష్మీ, శివప్రసాద్, ఆలయ ఇన్‌స్పెక్టర్ దిశంత్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణప్రసాద్ భట్టర్, ఉప ప్రధాన అర్చకులు రమేష్ స్వామి, సిబ్బంది నగేష్ తదితరులు పాల్గొన్నారు.