నిధులొచ్చినా తప్పని అడ్డంకులు
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:35 PM
విజ యవాడ నుంచి మైదుకూరుకు తక్కువ దూరం, వేగంగా ప్రయాణించేందుకు నాలుగు లేన్ల రహ దారి నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకు ప్రభు త్వం నిధులు మంజూరు చేసింది. ఈ నిర్మాణా నికి మైదుకూరు నుంచి సీతారాంపురం వెళ్లే దారి లో జిల్లాసరిహద్దు వరకు రైతుల స్థల సేకరణ చేసింది. వారికి అవార్డు మంజూరైనా కొందరు రైతులకు రికార్డులు సరిగా లేకోవడంతో కొందరికి నష్టపరిహారం అందింది, మరికొందరికి డబ్బు అందాల్సి ఉంది.

‘నాలుగులేన్ల’ నిర్మాణానికి అటవీ అనుమతులు ?
ఆటంకాలు తొలిగేదెన్నడు?
రైతులకు పరిహారం అందేదెప్పుడు
పోరుమామిళ్ల, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): విజ యవాడ నుంచి మైదుకూరుకు తక్కువ దూరం, వేగంగా ప్రయాణించేందుకు నాలుగు లేన్ల రహ దారి నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకు ప్రభు త్వం నిధులు మంజూరు చేసింది. ఈ నిర్మాణా నికి మైదుకూరు నుంచి సీతారాంపురం వెళ్లే దారి లో జిల్లాసరిహద్దు వరకు రైతుల స్థల సేకరణ చేసింది. వారికి అవార్డు మంజూరైనా కొందరు రైతులకు రికార్డులు సరిగా లేకోవడంతో కొందరికి నష్టపరిహారం అందింది, మరికొందరికి డబ్బు అందాల్సి ఉంది. ఆర్డీఓ వెరిఫికేషన్ అయిన తరు వాత వారికి అందే అవకాశాలున్నాయి. కానీ ఈ నిర్మాణం గతేడాది అక్టోబరులో ప్రారంభమైంది. 2026 ఏప్రిల్‌కు పూర్తిచేయాల్సి ఉంది. ఈ నిర్మా ణం పూర్తయితే విజయవాడ - సింగరాయకొండ కు, నేరుగా బెంగుళూరు నుంచి మైదుకూరుకు తక్కువ సమయంలో వెళ్లేందుకు అంచనాలు వేసి దాదాపు రూ.189 కోట్లు నిధులు మంజూరు చేసింది.
నాలుగులేన్ల రహదారిపై బ్రిడ్జి నిర్మాణానికి ఏర్పాట్లు చేసిన దృశ్యం
ఎద్దులాయపల్లె నుంచి సీతారాంపురం వరకు రోడ్డు విస్తరణ పనులు జరగాల్సి ఉంది. ఇందులో సీతారాంపురం వద్ద ఏడున్నర కిలోమీ టర్లు అటవీశాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉం ది. టేకూరుపేట చెక్‌పోస్టు నుంచి జిల్లా సరిహ ద్దు వరకు అనుమతులు ఇంకా రావాల్సి ఉంది. రంగసముద్రం బైపాస్ 1.8 కిలోమీటర్లు పెండిం గులో ఉంది. ఇందులో రైతులకు నష్టపరిహారం అందాల్సి ఉండగా, రికార్డులు అందిస్తే ఆర్డీఓ వెరిఫికేషన్ అయిన తరువాత వీరికి పరిహారం అందే అవకాశం ఉంది. టేకూరుపేట నుంచి రజాసాహబ్‌పేట వరకు ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతున్నాయి. నర్సింగ్‌పల్లె నుంచి రంగస ముద్రం వరకు నిర్మాణం జరగాల్సి ఉంది. ఈ రోడ్డు విస్తరణకు సంబంధించి 38.12 ఎకరాలు సంబంధించి 397 మంది రైతులకు ప్రభుత్వం రూ.9,92,40,120 అవార్డు ప్రకటించింది. కాశినా యన మండలానికి సంబంధించి 6.81 ఎకరాలకు 56 మంది రైతులకు రూ.86,80,251 అవార్డు ప్రకటించింది. బి.కోడూరు మండలానికి సంబం ధించి 2.44 ఎకరాలకు సంబంధించి 44 మంది రైతులకు రూ.27,99,460లు అవార్డు ప్రకటించిం ది.
టేకూరుపేట చెక్‌పోస్టు వద్ద జరుగుతున్న బ్రిడ్జిల నిర్మాణం
పోరుమామిళ్ల మండలానికి సంబంధించి 16.54 ఎకరాలకు సంబంధించి 55 మంది రైతుల కు రూ.3,61,16,678లు అవార్డు ప్రకటించింది. బి.మఠం మండలానికి సంబంధించి 12.33 ఎక రాలకు 242 మంది రైతులకు రూ.5,16,43,731లు అవార్డు ప్రకటించింది. ఇంకా ఇప్పటికీ 351 మంది రైతులకు రూ.7,62,96,346లు నష్టపరిహా రం అందాల్సి ఉంది. ఈ రైతులకు సంబంధిం చిన రికార్డులను రెవెన్యూ అధికారులకు స్వాఽధీ నం చేసి ప్యాకేజీ పొందాల్సి ఉంది. ప్రస్తుతం టేకూరుపేట చెక్‌పోస్టు సమీపంలో రజాసాహెబ్ పేట నుంచి ఎరసాల మీదుగా అర్త్ వరకు నిర్మా ణం జరుగుతున్నాయి. మధ్యలో బ్రిడ్జిల నిర్మాణా లు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి 10 శాతమే పనులు జరిగాయని సంబంధిత అఽధికారులు చెబుతున్నారు. రైతులకు సంబంధించి పూర్తిగా నష్టపరిహారం అందించి నిర్మాణం వేగవంతం చేస్తే భవిష్యత్తులో మైదుకూరు నుంచి విజయ వాడకు వెళ్లాలన్నా ఈ రహదారి సింగరాయ కొండ మీదుగా విజయవాడ వెళ్లేందుకు విజయ వాడ నుంచి మైదుకూరుకు అతి తక్కువ సమ యం పట్టే అవకాశాలున్నాయి. ఈ వేసవిలో కల్లా అర్త్ పని పూర్తయితే వచ్చే కాలానికి పను లు మరింత వేగం అందుకోవచ్చు. గ్రావెల్‌కు సంబంధించి నీళ్లు చల్లాలని కొందరు చెబుతు న్నారు. ఈ విషయం సంబంధిత శాఖ ఏఈ రామక్రిష్ణనాయక్ దృష్టికి తీసుకెళ్లగా ఎప్పటి కప్పుడు ట్యాంకర్లతో నీళ్లు చల్లుతున్నామని, దుమ్ము రాకుండా చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ఈ పనుల విషయంలో ఉన్నతాధికా రులు ప్రత్యేక చర్యలు తీసుకుంటే పనులు వేగం గా జరిగి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.