Share News

Overweight: ఏపీలో లావైపోతున్నారు.

ABN , Publish Date - Apr 08 , 2025 | 04:13 AM

అపోలో హెల్త్‌ ఆఫ్‌ ద నేషన్‌ నివేదిక ప్రకారం, ఏపీ, తెలంగాణలో 82 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు మధుమేహం, ఫ్యాటీ లివర్‌, విటమిన్‌ డీ లోపం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి.

Overweight: ఏపీలో లావైపోతున్నారు.

82 శాతం మందికి ఊబకాయం

24% మందికి హైబీపీ.. 23% మందికి మధుమేహం

81% మందిలో విటమిన్‌ డీ లోపం

66% మందికి ఫ్యాటీ లివర్‌

77% మహిళల్లో పోషకాహార లోపం

ఏపీ, తెలంగాణలో ఇదే పరిస్థితి

అపోలో హెల్త్‌ ఆఫ్‌ ద నేషన్‌ నివేదిక

అమరావతి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో ఊబకాయం సమస్య విపరీతంగా ఉందని అపోలో హెల్త్‌ ఆఫ్‌ ద నేషన్‌-2025 నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా 25 లక్షల మందిని పరీక్షించిన తర్వాత ఈ నివేదికను విడుదల చేసింది. విద్యార్థుల నుంచి పెద్దల వరకు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు వివరించింది. ఏపీ, తెలంగాణలో 82 శాతం మంది ఊబకాయం లేదా అధిక బరువు కలిగి ఉన్నారు. పిల్లలు, కళాశాల విద్యార్థుల్లో 28 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. 24 శాతం మందికి హైబీపీ ఉంది. 19 శాతం మంది ప్రీ హైపర్‌టెన్సివ్‌గా ఉన్నారు. 23 శాతం మందికి మధుమేహం ఉంది. 81 శాతం మంది విటమిన్‌ డీ లోపంతో బాధపడుతున్నారు. దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరిలో గ్రేడ్‌ 1 ఫ్యాటీ లివర్‌ సంకేతాలు ఉన్నాయి. లక్షలాది మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ దీర్ఘకాలిక అనారోగ్య స్థితిలో ఉంటున్నారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 66 శాతం మంది ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారు. ఇందులో 85 శాతం మంది ఆల్కహాల్‌ తీసుకోనివారే. 77 శాతం మహిళల్లో పోషకాహార లోపం ఉంది. 53,000 మందిని పరీక్షించగా అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ఆప్నియా ప్రమాదం ఎక్కువగా ఉందని నివేదికలో వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

TGSRTC: ఎండీకి నోటీసులు.. మోగనున్న సమ్మె సైరన్

Vaniya Agarwal: మైక్రోసాఫ్ట్‌ను అల్లాడించిన వానియా అగర్వాల్ ఎవరు

Rains: ఓరి నాయనా.. ఎండలు మండుతుంటే.. ఈ వర్షాలు ఏందిరా

Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..

Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..

Nara Lokesh: ‘సారీ గయ్స్‌..హెల్ప్‌ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్‌

LPG Price Hiked: పెరిగిన సిలిండర్ ధర.. ఎంతంటే..

Updated Date - Apr 08 , 2025 | 04:13 AM