AP Medical Jobs: వైద్య విభాగంలో 128 పోస్టులకు నోటిఫికేషన్
ABN , Publish Date - May 08 , 2025 | 05:28 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య విభాగంలో 128 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్వ్యూలు మే 16న విజయవాడలోని డీఎంఈ కార్యాలయంలో నిర్వహించనున్నారు
అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): డీఎంఈ పరిధిలోని ఆసుపత్రుల సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 128 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పోస్టులు మొత్తాన్ని వాకిన్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈనెల 16న విజయవాడలోని పాత ప్రభుత్వాసుపత్రిలో ఉన్న డీఎంఈ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ సూర్యకళ నోటిఫికేషన్‌లో తెలిపారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, లేటరల్ ఎంట్రీ ద్వారా పోస్టుల భర్తీ చేస్తామని చెప్పారు.