పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు 3న నోటిఫికేషన్
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:03 AM
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ పదవీకాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేం దుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూలును విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ చేస్తారు.

-10న నామినేషన్ల స్వీకరణ.. 11న పరిశీలన
-27న పోలింగ్.. మార్చి 3న ఓట్ల లెక్కింపు
-షెడ్యూలు విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
- మార్చి 29తో ముగియనున్న ఎమ్మెల్సీ పదవీకాలం
మచిలీపట్నం, జనవరి29 (ఆంధ్రజ్యోతి) :
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ పదవీకాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేం దుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూలును విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 10వతేదీలోగా అభ్యర్థులు నామినేషన్‌లను దాఖలు చేయాల్సి ఉంది. 11న నామినేషన్‌ల పరిశీలన ఉంటుంది. 13వతేదీ వరకు నామినేషన్‌లను ఉపసంహరించేందుకు అవకాశం కల్పించారు. 27న ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేస్తారు. మార్చి 8వ తేదీ నాటికి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తారు. ఎన్నికల షెడ్యూలు విడుదలైన నాటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా కేఎస్ లక్ష్మణరావు కొనసాగుతున్నారు.