ఉపాధ్యాయుడికి నోటీసులు
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:23 AM
మండలంలోని ఏలు కుంట్ల జిల్లాపరిషత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చాణ క్య అనే విద్యార్థిని ఆ పాఠశాల సైన్స ఉపాధ్యాయుడు జగన్నాథం కర్రతో గురువారం చితకబాదిన విషయం తెల్సిందే.

ధర్మవరంరూరల్, ఫిబ్రవరి14(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఏలు కుంట్ల జిల్లాపరిషత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చాణ క్య అనే విద్యార్థిని ఆ పాఠశాల సైన్స ఉపాధ్యాయుడు జగన్నాథం కర్రతో గురువారం చితకబాదిన విషయం తెల్సిందే. దీనిపై విచారణ చేసిన నివేదిక ఇవ్వాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ఎంఈఓలు గోపాల్‌నాయక్, రాజేశ్వరి శుక్రవారం ఆ పాఠశా లకు వెళ్లి విచారణ చేపట్టారు. ఆ పాఠశాల హెచఎం హనుమం తరెడ్డి వద్ద వివరాలు సేకరించారు. సైన్స ఉపాధ్యాయుడు జగన్నా థం పాఠశాలకు రాకపోవడంతో వివరణ ఇవ్వాలని ఎంఈఓలు హెచఎం ద్వారా నోటీసులు జారీచేశారు. విద్యార్థి చాణు క్యను పరా మర్శించారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు.