Tirupati Stampede : తొక్కిసలాటపై 17న విచారణకు రండి!
ABN , Publish Date - Mar 04 , 2025 | 07:03 AM
తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఈనెల 17న విచారణకు హాజరు కావాలని జిల్లా ఉన్నతాధికారులకు నోటీసులు జారీ అయినట్లు తెలిసింది.
తిరుపతి జిల్లా ఉన్నతాధికారులకు నోటీసులు
తిరుచానూరు, మార్చి 3(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఈనెల 17న విచారణకు హాజరు కావాలని జిల్లా ఉన్నతాధికారులకు నోటీసులు జారీ అయినట్లు తెలిసింది. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, 44మంది గాయపడిన విషయం విదితమే. దీనిపై రాష్ట్రప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్యంలో ఏకసభ్య న్యాయవిచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే రెండు విడతలుగా కమిషన్ విచారణ చేపట్టింది. తాజాగా ఈ నెల 17న కమిషన్ ఎదుట హాజరు కావాలని కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈవో శ్యామలరావు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజుకు సోమవారం నోటీసులు పంపినట్లు తెలిసింది.