Share News

ఆదోని సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయ సిబ్బందిపై వేటు

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:53 PM

ఆదోని సబ్‌ రిజిస్ర్టార్‌ హాజీమియాతో పాటు సీనియర్‌ అసిస్టెంట్‌ ఈరన్న, జూనియర్‌ అసిస్టెంట్‌ రమేష్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా రిజిసా్ట్రర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

   ఆదోని సబ్‌ రిజిసా్ట్రర్‌  కార్యాలయ సిబ్బందిపై వేటు

ఆదోని, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఆదోని సబ్‌ రిజిస్ర్టార్‌ హాజీమియాతో పాటు సీనియర్‌ అసిస్టెంట్‌ ఈరన్న, జూనియర్‌ అసిస్టెంట్‌ రమేష్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా రిజిసా్ట్రర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదోని పట్టణంలోని శిల్ప సౌభాగ్య నగర్‌ సమీపంలోని ఎగ్గటి ఈశ్వరప్పకు చెందిన 321/ఏ సర్వే నెంబరులోని 6.51ఎకరాల భూమిని అక్రమంగా రిజిసే్ట్రషన చేశారు. నంద్యాలకు చెందిన ఆముదాల భాస్కర్‌ అనే వ్యక్తి ఎగ్గటి ఈశ్వరప్ప కుమారుడిగా నకిలీ డాక్యుమెంట్లును సృష్టించి, తన తండ్రి ఈశ్వరప్ప 2009లోనే మరణించినట్లు నకలీ డెత సర్టిఫికెట్‌తో పాటు ఫ్యామిలీ మెంబర్స్‌ సర్టిఫికెట్లను ఏర్పాటు చేసుకుని పెద్ద మర్రివీడు గ్రామానికి చెందిన చాకలి ఈరన్నకు విక్రయించారు. రిజిసే్ట్రషన చేసే ముందు కనీసం డాక్యుమెంట్లను పరిశీలించకుండానే అధికారులు రిజిసే్ట్రషన చేశారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా ఆదోని సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో డీఆర్‌ చెన్నకేశవరెడ్డి పూర్తిస్థాయిలో విచారణ చేశారు. నకిలీ డాక్యుమెంట్లు ద్వారా అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి అక్రమ రిజిసే్ట్రషన చేసుకున్న వారిపై టూటౌన పోలీస్‌ స్టేషనలో బాధిత రైతు ఎగ్గటి ఈశ్వరప్ప ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సబ్‌ రిజిసా్ట్రర్‌ హాజీమియాతో పాటు సీనియర్‌ అసిస్టెంట్‌ ఈరన్న, జూనియర్‌ అసిస్టెంట్‌ రమేష్‌, డాక్యుమెంట్‌ రైటర్‌ మెహబూబ్‌, పొలాన్ని విక్రయించిన నంద్యాలకు చెందిన ఆముదాల భాస్కర్‌, పొలాన్ని కొనుగోలు చేసిన పెద్ద మర్రివీడుకు చెందిన చాకలి ఈరన్నపై టూ టౌన సీఐ సూర్యమోహన రావు కేసు నమోదు చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్‌ రిజిసా్ట్రర్‌తో పాటు సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లను రిజిసే్ట్రషన శాఖ డీఐజీ కళ్యాణి సస్పెండ్‌ చేశారు.

Updated Date - Jan 07 , 2025 | 11:53 PM