నంద్యాల సబ్ రిజిసా్ట్రర్‌పై వేటు
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:59 PM
కోర్టు వివాదంలో ఉన్న ఓ ఇంటి స్థలాన్ని అక్రమంగా రిజిసే్ట్రషన చేశారన్న అభియోగాల నేపథ్యంలో నంద్యాల సబ్ రిజిసా్ట్రర్ నాయక్ అబ్దుల్ సత్తార్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

ఎనీవేర్‌లో అక్రమ రిజిసే్ట్రషన
గతంలోనూ పలు అవినీతి ఆరోపణలు
సస్పెండ్ చేస్తూ రిజిసే్ట్రషన్ల శాఖ డీఐజీ ఉత్తర్వులు
నంద్యాల, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): కోర్టు వివాదంలో ఉన్న ఓ ఇంటి స్థలాన్ని అక్రమంగా రిజిసే్ట్రషన చేశారన్న అభియోగాల నేపథ్యంలో నంద్యాల సబ్ రిజిసా్ట్రర్ నాయక్ అబ్దుల్ సత్తార్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లా స్టాంప్స్ అండ్ రిజిసే్ట్రషన శాఖ డీఐజీ కళ్యాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షనతో పాటు కేసు విషయం తేలే దాకా జిల్లాను వదిలి ఎక్కడికి వెళ్లకూడదంటూ షరతులు విధించారు. కడప జిల్లాలోని పొద్దుటూరు పట్ణణానికి చెందిన ఓ మహిళకు ఐదుగురు కుమారులు. వారిలో ఇద్దరు కుమారులకు మాత్రమే గతంలో ఆమె స్థలాన్ని రిజిసే్ట్రషన చేసింది. దీంతో మిగిలిన ముగ్గురిలో ఒకరు ఆ స్థలంలో వాటా ఉందని వారితో తరచూ వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా సదరు స్థలంపై కోర్టును ఆశ్రయించాడు. వివాదం కోర్టు పరిధిలో ఉండగానే సదరు స్థలాన్ని తల్లితో కలిసి ఇద్దరు కుమారులు గుట్టుగా గతేడాది నవంబరు 24వ తేదీన విక్రయించారు. చివరకు కోర్టుకు వెళ్లిన వ్యక్తి కోర్టు స్టేటస్‌కో పత్రాలతో డీఐజీకి ఫిర్యాదు చేశారు. రిజిసే్ట్రషన్ల శాఖ ఐజీ అదేశాలతో ఆగమేఘాలపై డీఐజీ కళ్యాణి సదరు స్థలానికి సంబంధించి రిజిసే్ట్రషన, కోర్టు ఉత్తర్వ్యులు తదితర వివరాలను సమగ్రంగా పరిశీలించారు. కోర్టు వివాదంలో ఉన్నప్పటికి అక్రమంగా రిజిసే్ట్రషన చేశారని నిర్ధారణకు వచ్చారు. దీంతో సదరు సబ్‌రిజిసా్ట్రర్‌ను సస్పెండ్ చేయడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఫ గతంలోనూ ఆరోపణలు..?
ఎక్కడైనా సబ్ రిజిసే్ట్రషన కార్యాలయంలో ఏ పని జరగాలన్నా..ఏలాంటి సేవలైనా పొందాలన్నా.. కాసులు ఇవ్వందే పని జరగదనే విషయం అందరికి తెలిసిందే. ఇదే క్రమంలో సదరు సబ్ రిజిస్టర్‌పై కూడా ఈ కోర్డు వివాదం స్థలం రిజిసే్ట్రషన విషయమే కాదు.. ఆయన గతంలో పనిచేసిన ఎక్కడ చూసి ఇదే తరహాలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారని సమాచారం. ఈ స్థలం రిజిసే్ట్రషన విషయంలోను మాముళ్లు తీసుకుని చక్కదిద్దారనే ఆరోపణలు లేకపోలేదు. ప్రధానంగా గతంలో ఆళ్లగడ్డలో పనిచేసిన సమయంలో కూడా నంద్యాలకు చెందిన పలు స్థలాలు, భూములు ఎనీవేర్ రిజిసే్ట్రషన కింద రిజిసే్ట్రషన చేసి పెద్దఎత్తున సోమ్ముచేసుకున్నారనే విమర్శలున్నాయి. ఇదిలా ఉండగా నంద్యాలకు సబ్ రిజిసా్ట్రర్‌గా వచ్చిన సమయంలో కూడా రియల్టర్లు, బిల్డర్లు, వివిధ పార్టీలకు చెందిన నాయకులతో కూడా పెద్దఎత్తున వసూళ్లు చేసి క్యాష్ చేసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫ అసోసియేషన అడ్డుగా దోపిడి..?
ఈయన సుదీర్ఘకాలం కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువ కాలం సబ్ రిజిసా్ట్రర్‌గా పనిచేయడంతో పాటు ఆ శాఖ సబ్ రిజిసా్ట్రర్ల రాష్ట్ర అసోసియేషనలో కీలక పదవిలో ఉన్నారు. ఏళ్ల తరబడి అసోసియేషనలో ఉండటంతో ఆశాఖ ఉన్నతాధికారులతో కూడా సాన్నిహిత్యం ఎక్కువగా ఉండటంతో తన పైరవీలకు ఎంతగానో కలిసివచ్చినట్లైంది. ఇదే క్రమంలో ఇటీవల జరిగిన సబ్ రిజిసా్ట్రర్ల బదిలీల్లో కూడా రూ.లక్షల్లో వసూళ్లు చేశారనే ఆరోపణలు లేకపోలేదు. ఈ వ్యవహరంలో ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో పనిచేస్తున్న కొందరు సబ్ రిజిసా్ట్రర్లతో పాటు ఓ సూపరింటెండెంట్ పాత్ర కూడా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మొత్తంగా కోర్టు వివాదంలో ఉన్న స్థలం రిజిసే్ట్రషన.. ఈయన పనితీరు తదితర ఆంశాల పరంగా చూస్తుంటే తీగ లాగితే.. డొంక కదులుదోందనే విధంగా సదరు సబ్ రిజిసా్ట్రర్ వ్యవహారం ఉన్నట్లు హాట్ టాఫిక్‌గా నడుస్తోంది.
ఫ ఆశాఖ వర్గాల్లో కలకలం
కోర్టు వివాదం స్థలం రిజిసే్ట్రషన వ్యవహరంలో భాగంగా సదరు సబ్ రిజిసా్ట్రర్‌ను ఆ శాఖ డీఐజీ కళ్యాణి సస్పెన్షన చేయడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆశాఖ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇదే క్రమంలో కొన్ని రోజుల కిందట రూ. కోట్లు విలువ చేసే భూమిని అక్రమ రిజసే్ట్రషన గుట్టురట్టు కావడం.. బాధ్యులను సస్పెన్షన చేయడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించడంతో ఆశాఖ వర్గాలను కలవరపాటుకు గురిచేసినట్లైంది. అంతేకాకుండా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ సమయంలో ఎక్కడ ఎవరిపై ఏలాంటి చర్యలు ఉంటాయోనని ఆశాఖ వర్గాల్లో కలకలం రేపుతోంది.