ఎమ్మెల్సీ బరిలో 70 మంది అభ్యర్థులు
ABN , Publish Date - Feb 14 , 2025 | 06:39 AM
రాష్ట్రంలో శాసనమండలి ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం ముగిసింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో బరిలో పది మంది

విశాఖపట్నం/ఏలూరు/గుంటూరు, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శాసనమండలి ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం ముగిసింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో బరిలో పది మంది అభ్యర్థులు నిలిచారు. ఇక ఉమ్మడి తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 35 మంది పోటీపడనున్నారు. మొత్తం 54 మంది నామినేషన్లు దాఖలు చేయగా పరిశీలనలో 11 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 8 మంది పోటీ నుంచి తప్పుకోవడంతో 35 మంది బరిలో మిగిలారు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఎన్నికల్లో గురువారం ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా తుదిపోరులో 25 మంది అభ్యర్థులు నిలిచారు.