సందడే.. సందడి..
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:00 AM
ఎమ్మిగనూరు పట్టణంలో జాతర సందడే.. సందడి.. ప్రధాన రహదారులన్నీ జాతరకు వచ్చిన జనంతో నిండిపోయి కనిపిస్తున్నాయి.

ఎమ్మిగనూరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు పట్టణంలో జాతర సందడే.. సందడి.. ప్రధాన రహదారులన్నీ జాతరకు వచ్చిన జనంతో నిండిపోయి కనిపిస్తున్నాయి. తే రుబజారు జనంతో కిటకిటలాడింది. ఆప్రాంతంలో మిఠాయి దుకాణాల, పసుపు,కుంకుమ, వంటసామగ్రి, పిల్లల ఆటవస్తువులు, మహిళలకు సంబందించిన గాజుల, అలంకరణ వస్తువుల దుకాణాలు ఏర్పాటు చేశారు. దీంతో జనం వాటని కొనేందుకు భారీగా తరలివస్తున్నారు. శ్రీనివాస సర్కిల్, సోమేశ్వర సర్కిల్, తేరుబజారు ప్రాంతం జనంతో రద్దీగా మారింది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారు తిరిగి వెళ్లేటప్పుడు గాజులు, పసుపు, కుంకుమతో పాటు మిఠాయిలు, బొరుగులు తీసుకెళ్తూ కనిపించారు. అలాగే మహిళలు అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తు కనిపించారు. మొత్తంగా పట్టణం జనసందోహంతో సందడి.. సందడిగా మారింది.