సంక్రాంతి వేడుకలేవీ...?
ABN , Publish Date - Jan 12 , 2025 | 10:59 PM
నాడు సంక్రాంతి పండుగ వచ్చిం దంటే గ్రామాల్లో సందడి వాతా వరణం నెలకొనేది. ఘనంగా వేడుకల ను నిర్వహించుకునే వారు. కోడిపందే లు, ఎడ్ల పందాలు, రంగు రంగు ముగ్గుల్లో.. గొబ్బెమ్మలు, హరి దాసులు, గంగి రెద్దులు, కొత్త అల్లుళ్లతో సంక్రాం తి పండుగ కళకళలాడేది. పల్లెల్లో గాలి పటాల ఎగురవేత, ఇళ్లల్లో బాలికలు ఏర్పాటు చేసే బొమ్మల కొలువు, ఇంటి ముందు గంగి రెద్దుల నృత్యాలు ఇలా సంక్రాంతి పండుగ వేడుకగా జరిగేది. ఇదంతా ఒకప్పటి సంగతి. ఇప్పుడు సంక్రాంతి పండుగ మారిపోయింది.

కనుమగవుతున్న గంగిరెద్దు
జాడలేని గంగిరెద్దుల నృత్యాలు
గొబ్బి ఆటలు ఆడేవారెవరు ?
వినిపించని హరిదాసుల గొంతు
బద్వేలు, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): నాడు సంక్రాంతి పండుగ వచ్చిం దంటే గ్రామాల్లో సందడి వాతా వరణం నెలకొనేది. ఘనంగా వేడుకల ను నిర్వహించుకునే వారు. కోడిపందే లు, ఎడ్ల పందాలు, రంగు రంగు ముగ్గుల్లో.. గొబ్బెమ్మలు, హరి దాసులు, గంగి రెద్దులు, కొత్త అల్లుళ్లతో సంక్రాం తి పండుగ కళకళలాడేది. పల్లెల్లో గాలి పటాల ఎగురవేత, ఇళ్లల్లో బాలికలు ఏర్పాటు చేసే బొమ్మల కొలువు, ఇంటి ముందు గంగి రెద్దుల నృత్యాలు ఇలా సంక్రాంతి పండుగ వేడుకగా జరిగేది. ఇదంతా ఒకప్పటి సంగతి. ఇప్పుడు సంక్రాంతి పండుగ మారిపోయింది. పండుగ రోజు తెల్లవారు జామున లేచి, తలంటి స్నానాలు చేసి, నూతన దుస్తులు ధరించి, మహిళలు పోటాపో టీగా రంగు రంగుల ముగ్గులువేసి ఇంటి పరిసరాలను ముచ్చటగా తయారు చేసుకు నేవారు. నేడు అలాంటి దృశ్యాలు కనుమరుగ వుతున్నాయి. పట్టణ వాసులు సైతం సంక్రాంతి పండుగ అనగానే పది రోజుల ముందే పల్లెకు చేరుకుని, అంతా కలసి పం డుగ సంబరాల్లో మునిగే వారు. తెల్లవారు జామునే బాలసంతలు, పకీరుల వేషాలు వంటి దృశ్యాలు ఏనాడో కనుమరుగయ్యాయి.
గంగిరెద్దు ఆటలు (ఫైల్ ఫొటో)
ఇంటి ముందుకు వచ్చి వంగి వంగి దండాలు పెట్టే గంగిరెద్దు నృత్యాల జాడలేకుండా పోయాయి. ఉదయాన్నే తలపాగా చుట్టుకుని ఇంటిముందు హరిదాసులు పాడే గీతాలు మచ్చుకైనా విన్పించడం లేదు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే గ్రామాల్లో నెలరోజుల నుంచే సందడి వాతా వరణం నెలకొనేది. ఇప్పటి పరిస్థితుల్లో పాఠశాలలు, కళాశాలలు, బీటెక్ కళాశాలలు నామమాత్రంగానే సంక్రాం తి వేడుక చేస్తున్నారు. ప్రజలకు ఇప్పుడు సంక్రాంతి పండుగ భారంగా మారింది. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడం తో ఏమీ కొనలేని పరిస్థితి ఏర్పడింది. పల్లెల్లో కరువు ఉండడంతో సంక్రాంతి పండుగను నా మ మాత్రంగా చేసుకునే పరిస్థితి ఏర్పడింది.
రెడీమేడ్ వస్తువులపై ఆసక్తి
నాడు సంక్రాంతి పండుగ వస్తుందంటే 20రోజుల ముందే పల్లెల్లో ఇండ్లల్లో వి విధ రకాలు పిండివంటలు చేసేవారు. కర్జికాయ లు, కారాలు, లడ్లు, అత్తరాసలు వంటివి స్వ యంగా మహిళలు చేసుకునేవారు. అయితే రెడీమెడ్‌గా దొరుకుతుండడంతో పాత కాలపు వంటలకు స్వస్తిపలికి, రెడీమెడ్‌లో లభించే వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనపరుస్తుండడంతో నాటి వంటకాలు, వాటి రుచులకు దూరమవుతున్నారు.
గంగిరెద్దు
జాడలేని గంగిరెద్దుల నృత్యాలు
సంక్రాంతి పండుగ వచ్చిందంటే పశువులను ఎంతో అందంగా అలంకరించే సంప్రదాయం. గంగిరెద్దులను ఎంతో అందంగా అలంకరిం చి, ఇండ్ల ఎదుట మేళం వాయిస్తే వాటికి అనుగుణంగా గంగిరెద్దులు నృత్యం చేసేవి. ఈ నృత్యం ఎంతో ఆనందకరంగా ఉండేది. అయ్యగారికి దండంపెట్టు అని చెప్పగానే గంగిరెద్దు కిందికి వంగి దండంపెట్టడం వంటి వి సంక్రాంతికి ఎంతో సందడిచేసేవి. ఆ గంగి రెద్దు యజమానికి పాత వస్త్రాలు, దాన్యము ఇచ్చేవారు. కాలానుగుణంగా ఈ గంగిరెద్దుల నృత్యాలు జాడలేకుండా పోతున్నాయి.
విన్పించని హరిదాసుల రాగం
సంక్రాంతి పండుగ రోజు గ్రామాల్లో హరిదా సుల హడావిడి ఉండేది. తలకు పాగా కట్టుకుని తంబురా చేతపట్టుకుని ఇంటి వద్దకు వచ్చి ‘హరిలో రంగ హరి’ అంటూ ఎంతో ముచ్చటగా రాగాలు తీసేవారు. నేడు హరిదాసుల రాగాలే విన్పించడంలేదు. రం గు రంగుల ముగ్గులువేసి, ముగ్గుల్లో గొబ్బె మ్మలను పెట్టి, బాలికలు గుమికూడి చక్క గా పాటలు పాడి ఆడుతూ సందడి చేసేవా రు. నేడు గొబ్బెమ్మలు, అలనాటి పాటలు, ఆటలు కొన్నిచోట్లే సాగుతున్నాయి.
నాటి ధాన్యపు రాసులు
తాతయ్యా ధాన్యపు రాసులు చూపించ వా.... నానమ్మా లేగదూడలు ఎక్కడ.... అమ్మమ్మా హరిదాసులేరి, గంగిరెద్దులేవీ. సంక్రాంతి పండుగకు వివిధ ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు చేరుకున్న వారి పిల్ల లు వేస్తున్న ప్రశ్నలు ఇవి. అయితే తాత య్య, నానమ్మల గొంతు పెగలడం లేదు. వ్యవసాయంతో ముడిపడి సాగే సంక్రాంతిని ఈ సారి కరువు కమ్మేసింది. పల్లెల్లో పచ్చని పొలాలు బీళ్లుగా మారడంతో రైతన్నల ముం గిట ధాన్యపు రాశులు పెద్దగా కానరావడం లేదు. 40శాతం కూడా దాటని విస్తీర్ణంలో పెట్టిన పంటలు ఎలా కాపాడుకోవాలో అని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కన్నా, ఈ సారి వ్యాపారాలు తగ్గాయ ని, వ్యాపార వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి.