Share News

ఏ వీధిలో చూసినా చెత్తే..!

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:27 AM

మండల కేంద్రంలో ఎక్కడ చూసినా చెత్తదిబ్బలే దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివాస్‌ కార్యక్రమాన్ని ప్రతినెలా మూడో శనివారం నిర్వహి స్తోంది.

ఏ వీధిలో చూసినా చెత్తే..!
బీసీ కాలనీలోకి వెళ్లే ప్రధాన రహదారి పక్కన పడి ఉన్న చెత్త

కొత్తచెరువు, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఎక్కడ చూసినా చెత్తదిబ్బలే దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివాస్‌ కార్యక్రమాన్ని ప్రతినెలా మూడో శనివారం నిర్వహి స్తోంది. అయితే అధికారులు తూతూ మంత్రంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు మాత్రమే ఒక ప్రాంతాన్ని ఎంచుకొని.. అక్కడ హడావుడి చేస్తున్నారే తప్పా అన్ని వీధులను శుభ్రం చేయించడం లేదు. బీసీ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి ప్రక్కన కొన్ని నెలలుగా చెత్తాచెదారం పేరుకుపోయింది. దీంతో ఆ ప్రాంతం దుర్గందం వస్తోందని సమీప ప్రజలు వాపోతు న్నారు. అదేవిధంగా ధర్మవరం ప్రధాన రహదారి పక్కన విజయ నగర్‌ కాలనీ, ఉర్దూ పాఠశాల, మరువ ఆంజనేయస్వామి ఆలయం వద్ద చెత్తాచెదారం పేరుకుపోయింది. మురుగు నీరు రోడ్లపై పారుతోందని పలు కాలనీల వాసులు వాపోయారు. పంచాయతీ అఽఽధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Feb 03 , 2025 | 12:27 AM