జగన్‌రెడ్డి,సాయిరెడ్డి ఎన్ని డ్రామాలాడినా ప్రజలు నమ్మరు
ABN , Publish Date - Jan 26 , 2025 | 12:56 AM
జగన్ రెడ్డి, విజయ సాయిరెడ్డి ఎన్ని డ్రామా లాడినా ప్రజలు నమ్మరని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. శనివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లు అధికారాన్ని అడ్డంపెట్టుకుని రాషా్ట్రన్ని పీల్చిపిప్పిచేశారన్నారు. విజయసాయిరెడ్డి చేసిన అవినీతి, భూ దందాలు ఒక్కొక్కటి బయటపడటంతో డ్రామాలకు తెరతీ శారని చెప్పారు.
మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీ పట్నం టౌన్, జనవరి 25 (ఆంధ్ర జ్యోతి): జగన్ రెడ్డి, విజయ సాయిరెడ్డి ఎన్ని డ్రామా లాడినా ప్రజలు నమ్మరని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. శనివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లు అధికారాన్ని అడ్డంపెట్టుకుని రాషా్ట్రన్ని పీల్చిపిప్పిచేశారన్నారు. విజయసాయిరెడ్డి చేసిన అవినీతి, భూ దందాలు ఒక్కొక్కటి బయటపడటంతో డ్రామాలకు తెరతీ శారని చెప్పారు. కాకినాడ పోర్టు విషయంలో విజయసాయిరెడ్డి బండారం బయట పడింద న్నారు. విశాఖపట్నంలో చేసిన భూ దోపిడీల న్నీటిని ప్రభుత్వం త్వరలో బయటపెడుతుందని చెప్పారు. అధికారం ఉన్నప్పుడు కన్నుమిన్ను తెలియకుండా రోజులు గడిపి, ఇష్టం వచ్చినట్టు వీర్ర వీగారన్నారు. ఇప్పు డు తమ బండారం బయట పడటంతో విజయ సాయిరెడ్డి రాజీ నామా చేస్తున్నారని తెలిపారు. విజయ సాయిరెడ్డి దేశం విడిచి వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం, నిఘా సంస్థలు దృష్టి సారించా లన్నారు. చంద్రబాబు, లోకేశ్ కుటుంబాలపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికీ అవినీతి, దోపిడీ, భూదందాల నుంచి తప్పించు కునేందుకు ప్రయ త్నాలు చేస్తున్నారన్నారు. మునిగిపోయిన వైసీపీ పడవలో ఉండలేక ఒక్కొక్కరు బయటకు వస్తున్నారని మంత్రి రవీంద్ర వివరించారు.