Deputy Collector Transfers: తొమ్మిది మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
ABN , Publish Date - May 07 , 2025 | 07:16 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొమ్మిది మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు
అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తొమ్మిదిమంది డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. మంగళవారం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీగా ఉన్న శీనా నాయక్‌ను విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ఈవోగా బదిలీ చేశారు. పులివెందుల ఆర్డీవోగా జి.చిన్నయ్యను, వెయిటింగ్‌లో ఉన్న కేఎల్ శివజ్యోతిని మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టరేట్‌లో జాయింట్ డైరెక్టర్‌గా నియమించారు. వెయిటింగ్‌లో ఉన్న హనుమంతరావు ఆనంద్‌ను అనంతపురం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(పీఏబీఆర్‌గా) నియమించారు. కాకినాడ సెజ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేవీ రామలక్ష్మిని విశాఖపట్నం మహిళా, శిశు సంక్షేమశాఖ పీడీగా, తూర్పుగోదావరి జిల్లాలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో పనిచేస్తున్న జి.మమ్మిని కోనసీమ జిల్లా సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా, అనంతపురం జిల్లా (అహుడా) అహుడా సెక్రటరీ గౌరీశంకర్రావును తిరుపతి జిల్లా సమగ్ర శిక్షణ అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌గా, పల్నాడు జిల్లా ఎస్‌డీసీ కేఆర్‌ఆర్‌సీ కుమిదిని సింగ్‌ను కృష్ణా జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌గా, మచిలీపట్నం అర్బన్ డవల్‌పమెంట్ అథారిటీ ఎస్‌డీసీ పద్మావతిని గుంటూరు జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌గా బదిలీ చేశారు.