New School Opens in Ramanjaneyapuram: బడి వచ్చింది.. బాధ తప్పింది
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:08 AM
పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం రామాంజనేయపురంలో మూడు దశాబ్దాల చదువుల కష్టాలకు..
రామాంజనేయపురంలో పాఠశాల ప్రారంభం
ప్రస్తుతం ఒక ఉపాధ్యాయుడితో తరగతులు ఆరంభం
బెల్లంకొండ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం రామాంజనేయపురంలో మూడు దశాబ్దాల చదువుల కష్టాలకు మోక్షం లభించింది. బుధవారం గ్రామంలో పాఠశాల ప్రారంభమైంది. ఇక్కడి విద్యార్థుల అవస్థలపై ‘చదువు వారికి సాహసమే’ శీర్షికన ఆగస్టు 16న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ స్పందించి, విద్యాశాఖ మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి ఆదేశాలతో కలెక్టర్ అరుణ్‌బాబు రామాంజనేయపురాన్ని సందర్శించి పాఠశాల ఏర్పాటు చేస్తామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో బుధవారం గ్రామంలో పాఠశాలను టీడీపీ రాష్ట్ర నేత వెన్నా సాంబశివారెడ్డి ప్రారంభించారు. తొలిరోజు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఒక ఉపాధ్యాయుడితో తరగతులు ఆరంభిస్తున్నట్లు పల్నాడు జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ఏసుబాబు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. ‘ఆంధ్రజ్యోతి’ని, మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే ప్రవీణ్ చేసిన మేలును మర్చిపోలేమన్నారు.