Share News

Visakhapatnam: భువనేశ్వర్‌ విమాన సర్వీస్‌కు వీజీఎఫ్‌

ABN , Publish Date - May 28 , 2025 | 06:09 AM

విశాఖపట్నం-భువనేశ్వర్‌ మధ్య జూన్‌ 12 నుండి ఇండిగో విమాన సర్వీస్‌ ప్రారంభం కానుంది. వాయుయాన సంస్థకు నష్టం వచ్చినప్పుడే వీజీఎఫ్‌ ద్వారా ఒడిశా ప్రభుత్వం సహాయం చేస్తుంది.

Visakhapatnam: భువనేశ్వర్‌ విమాన సర్వీస్‌కు వీజీఎఫ్‌

విశాఖపట్నం, మే 27 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం-భువనేశ్వర్‌ మధ్య వచ్చే నెల 12వ తేదీ నుంచి కొత్త విమాన సర్వీస్‌ ప్రారంభం కానుంది. దీనిని ఇండిగో సంస్థ నడుపనుంది. ఒకవేళ ఆక్యుపెన్సీ తక్కువగా ఉండి ఆ సంస్థకు ఏమైనా నష్టాలు వచ్చినట్టయితే ‘వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌’ (వీజీఎఫ్‌) ద్వారా భర్తీ చేయడానికి ఒడిశా ప్రభుత్వం అంగీకరించింది. దీనికి కృషిచేసిన ఆ రాష్ట్ర గవర్నర్‌ కంభంపాటి హరిబాబును ఏపీ విమాన ప్రయాణికుల సంఘం (అపాటా) ప్రతినిధులు నరేశ్‌కుమార్‌, కాశీవిశ్వనాథరాజు, డీఎస్‌ వర్మ భువనేశ్వర్‌లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విమాన సర్వీస్‌ ప్రతిరోజూ విశాఖపట్నానికి మధ్యాహ్నం 1.55 గంటలకు వచ్చి, తిరిగి 2.25 గంటలకు బయలుదేరి భువనేశ్వర్‌ వెళుతుంది. వారానికి నాలుగు రోజులు నడిచే అబుదాబి విమానం జూన్‌ 13 నుంచి ప్రారంభమవుతుందని, ఇది ఉదయం 8.20 గంటలకు విశాఖపట్నం వచ్చి, తిరిగి ఇక్కడి నుంచి 9.50 గంటలకు బయలుదేరుతుందని వారు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 06:09 AM