Share News

కొత్తగా 1.10 లక్షల వితంతు పెన్షన్లు: కొండపల్లి

ABN , Publish Date - Jul 25 , 2025 | 05:28 AM

ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రతా పెన్షన్‌ను అర్హులైన వారందరికీ అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యం.

 కొత్తగా 1.10 లక్షల వితంతు పెన్షన్లు: కొండపల్లి

అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): ‘ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రతా పెన్షన్‌ను అర్హులైన వారందరికీ అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యం.అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్‌ జారీ పద్ధతిని సరళీకృతం చేసింది’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఈమేరకు ఆయన గురువారం ఒక ప్రకటన చేశారు.‘పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు వీలైనంత త్వరగా పెన్షన్‌ ఇచ్చే విధానాన్ని అమల్లోకి తెచ్చాం.మొత్తంగా 1,09,155 మంది కొత్తగా పెన్షన్‌ పొందేందుకు అర్హత కలిగి ఉన్నారు. ఆగస్టు నుంచి కొత్తగా వారందరికీ స్పౌజ్‌ కేటగిరీలో వితంతు పెన్షన్‌ మంజూరుకు విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.దీనికి ప్రతి నెలా రూ.43.66 కోట్లు అదనంగా ప్రభుత్వం ఖర్చు చేయనుంది’ అని మంత్రి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 05:30 AM