Share News

Old Man Attack on Girl: ఏపీలో దారుణం.. ఐసీయూలో బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం

ABN , Publish Date - Oct 31 , 2025 | 02:38 PM

నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో 8 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల వయసున్న వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. బాలిక ఒంటరిగా ఉండటంతో కామాంధుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

 Old Man Attack on Girl: ఏపీలో దారుణం.. ఐసీయూలో బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం
Old Man Attack on Girl

నెల్లూరు, అక్టోబర్ 31: బాలికలు, మహిళలు, వృద్ధులపై ఎక్కడో ఒకచోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా ఉన్న అమ్మాయిలను చిదిమేసేందుకు కీచకులు ఎంతటి దుశ్చర్యకైనా పాల్పడుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులపై కూడా కామవాంఛ తీర్చుకుంటున్నారు. చిన్న పిల్లలనుంచి వృద్ధ మహిళల వరకు ఎవ్వరినీ విడిచిపెట్టడం లేదు. ఒంటరిగా ఉన్న ఆడవాళ్లపై కన్నేసి, కామాంధులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. మరికొందరైతే అత్యాచారం చేసి దారుణంగా హత్యలు చేస్తున్నారు. కొంతమంది క్రూరమైన వికృత మృగాళ్లు ఉన్న సమాజంలో ఆడవాళ్లు ఒంటరిగా వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది.


ఆంధ్ర‌ప్రదేశ్‌లో మరో దారుణం తీవ్ర కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో 8 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల వయసున్న వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. ఆసుపత్రిలో తన తండ్రి వద్ద అటెండర్‌గా బాలిక ఉంటోంది. ఈ క్రమంలోనే ఎవరూ లేని సమయంలో కామాంధుడు దుశ్చర్యకు పాల్పడ్డాడు. దీనిని గమనించిన ఆసుపత్రి సిబ్బంది, అక్కడున్న రోగుల అటెండర్లు సదరు కామాంధుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటపై పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో డీఎస్పీ గీతాకుమారి విచారణ చేపట్టారు.


ఇవి కూడా చదవండి:

Jangareddygudem Woman Harassed: దారుణం.. భర్త సోదరుడిని సుఖ పెట్టాలంటూ..

Viveka Case: సునీతపై వివేకా హత్య కేసు నిందితుల సంచలన ఆరోపణలు

Updated Date - Oct 31 , 2025 | 06:41 PM