Share News

మున్సిపల్‌ సిబ్బంది నిర్లక్ష్యం

ABN , Publish Date - Mar 05 , 2025 | 11:41 PM

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పట్టణం.. జిల్లా కేంద్రం... కలెక్టరేట్‌ సమీపం.. అందులోను ప్రధాన రహదారి.. భూగర్భ మురుగు కాలువల మరమ్మతులో భాగంగా నాలుగు రోజుల క్రితం మున్సిపల్‌ సిబ్బంది ఇలా గుంత తవ్వారు.

మున్సిపల్‌ సిబ్బంది నిర్లక్ష్యం
గుంత వద్ద ఉంచిన కొమ్మలు

పుట్టపర్తిటౌన, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పట్టణం.. జిల్లా కేంద్రం... కలెక్టరేట్‌ సమీపం.. అందులోను ప్రధాన రహదారి.. భూగర్భ మురుగు కాలువల మరమ్మతులో భాగంగా నాలుగు రోజుల క్రితం మున్సిపల్‌ సిబ్బంది ఇలా గుంత తవ్వారు. అనంతరం ఆ గుంతను పూడ్చకుండా అలాగే వదిలేశారు. కనీసం అక్కడ గుంత ఉన్నట్లు హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. నాలుగు రోజులైనా వారు ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రధాన రహదారిలో ఇలా గుంత ఉండటంతో.. ప్రమాదాలు జరకుండా స్థానికులు ఆ గుంత వద్ద ఇలా కొమ్మలు ఉంచి.. వాహనదారులను అప్రమత్తం చేశారు.

Updated Date - Mar 05 , 2025 | 11:41 PM