National Science Day: వీఐటీ-ఏపీలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
ABN , Publish Date - Mar 01 , 2025 | 06:33 AM
‘‘వికసిత్ భారత్-2047 కోసం సైన్స్, ఆవిష్కరణల్లో ప్రపంచ నాయకత్వం కోసం భారత యువతకు సాధికారత’’ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎం.జగదీశ్ హాజరయ్యారు.
అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘‘వికసిత్ భారత్-2047 కోసం సైన్స్, ఆవిష్కరణల్లో ప్రపంచ నాయకత్వం కోసం భారత యువతకు సాధికారత’’ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎం.జగదీశ్ హాజరయ్యారు. దేశీయ బ్యాటరీ పరిశ్రమకు మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్-ఎలకా్ట్రనిక్స్, మెటీరియల్స్ ఇంజనీరింగ్ ప్రధాన రంగాల్లో నిపుణులు చాలా అవసరమని ఆయన తెలిపారు. వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, ఎంటర్‌ప్రైన్యూర్‌షిప్ చొరవతో అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహా ప్రసిద్ధ బ్యాంకులతో ఏడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఎస్.వి.కోటారెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan: భవిష్యత్తులో ఏపీలో రాబోయే మార్పులు చెప్పిన పవన్
Vamsi Petition: బ్యారక్ మార్చండి.. లేదా ఖైదీలను పంపండి.. వంశీ పిటిషన్
మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..