Share News

జాతీయ స్థాయి అండర్‌-14 క్రికెట్‌ ఆంధ్రా జట్టు కెప్టెనగా రుత్విక్‌

ABN , Publish Date - Feb 01 , 2025 | 11:55 PM

స్థానిక ఎన ఆర్‌ పేట శ్రీ లక్ష్మీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి వై. రిత్విక్‌ కళ్యాణ్‌ జాతీయస్థాయిలో పాట్నాలో జరిగే, అండర్‌-14 క్రికెట్‌ పోటీలలో ఆంధ్రప్రదేశ జట్టుకు కెప్టెనగా ఎంపికయ్యారు.

జాతీయ స్థాయి అండర్‌-14 క్రికెట్‌   ఆంధ్రా జట్టు కెప్టెనగా రుత్విక్‌
విద్యార్థులకు ట్రోఫీని అందజేస్తున్న పాఠశాల డైరెక్టర్‌ దీక్షిత

కర్నూలు ఎడ్యుకేషన, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన ఆర్‌ పేట శ్రీ లక్ష్మీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి వై. రిత్విక్‌ కళ్యాణ్‌ జాతీయస్థాయిలో పాట్నాలో జరిగే, అండర్‌-14 క్రికెట్‌ పోటీలలో ఆంధ్రప్రదేశ జట్టుకు కెప్టెనగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్‌ దీక్షిత మాట్లాడుతూ అమలాపురంలో రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన క్రికెట్‌ పోటీలో కర్నూలు జట్టు తరపున ప్రతిభను కనబరిచి 204 పరుగులు చేసి 5 వికెట్లను తీసి, జట్టు మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడని తెలిపారు. ఈ కార్యక్రములో సర్వేపల్లి పాఠశాలల వ్యవస్థాపకుడు పి. శేషన్న, పాఠశాల ప్రధానోపాయురాలు అరుణశ్రీ, ఉపాధ్యాయులు, విధ్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2025 | 11:55 PM