Share News

Delhi Visit: ఢిల్లీ చేరుకున్న లోకేశ్‌

ABN , Publish Date - Jun 18 , 2025 | 05:25 AM

రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ బయలుదేరిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ మంగళవారం రాత్రి అక్కడికి చేరుకున్నారు.

Delhi Visit: ఢిల్లీ చేరుకున్న లోకేశ్‌

  • ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులతో నేడు భేటీ

అమరావతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ బయలుదేరిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ మంగళవారం రాత్రి అక్కడికి చేరుకున్నారు. బుధ, గురువారాల్లో ఆయన ఢిల్లీలోనే ఉంటారు. బుధవారం ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌తో లోకేశ్‌ సమావేశం అవుతారు. అనంతరం కేంద్ర మంత్రులు చిరాగ్‌ పాశ్వాన్‌, ధర్మేంద్ర ప్రదాన్‌, అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ను కలుస్తారు. గురువారం కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియాతో భేటీ తర్వాత.. బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో లోకేశ్‌ సమావేశం అవుతారు.

Updated Date - Jun 18 , 2025 | 05:27 AM