Heritage Foods: పాడి రైతుల సమగ్రాభివృద్ధే ‘హెరిటేజ్’ లక్ష్యం
ABN , Publish Date - Jan 30 , 2025 | 04:50 AM
హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ వైస్ చైర్‌పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరులోని హెరిటేజ్ పాలశీతలీకరణ కేంద్రంలో బుధవారం పాడి రైతుల మహా సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు.

పాడి రైతుల మహా సదస్సులో నారా భువనేశ్వరి
పీలేరు, జనవరి 29(ఆంధ్రజ్యోతి): నాణ్యమైన ఉత్పత్తులు, వినియోగదారుల సంతృప్తి, పాడి రైతుల సమగ్రాభివృద్ధే తమ సంస్థ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ వైస్ చైర్‌పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరులోని హెరిటేజ్ పాలశీతలీకరణ కేంద్రంలో బుధవారం పాడి రైతుల మహా సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. ఆమె మాట్లాడుతూ మహిళలను పాడి రైతులుగా ప్రోత్సహించాలన్న లక్ష్యంతో తమ సంస్థ ద్వారా ప్రత్యేకంగా మహిళా ఏజెంట్ల ద్వారా పాల సేకరణ కేంద్రాలు నడుపుతున్నామన్నారు. పాల నాణ్యతను మెరుగుపరచడం, ఆధునిక పశుసంవర్థక పద్ధతులను ప్రోత్సహించడానికి అమెరికాకు చెందిన ‘టెక్నో సెర్వ్’ సంస్థతో ఒప్పందం చేసుకుంటున్నామని తెలిపారు. ఆమె సమక్షంలో హెరిటేజ్, టెక్నో సెర్వ్ సంస్థల ప్రతినిధులు ఎంవోయూ పత్రాలను మార్చుకున్నారు. అనంతరం భువనేశ్వరి రూ.183.5 లక్షల రుణ చెక్కును పాడి రైతులకు అందజేశారు. పలు ప్రమాదాల్లో గాయపడిన బాధితుల కుటుంబాలకు రూ.21.45 లక్షల చెక్కులను అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 15 మంది మహిళా ఏజెంట్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు.