Share News

Guntur Court: నందిగం సురేష్‌ బెయిల్‌పై విడుదల

ABN , Publish Date - Jul 02 , 2025 | 04:14 AM

వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ మంగళవారం బెయిల్‌పై విడుదలయ్యారు. టీడీపీ కార్యకర్తపై దాడి, హత్యాయత్నం కేసులో ఆయనకు గుంటూరు జిల్లా కోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది.

Guntur Court: నందిగం సురేష్‌ బెయిల్‌పై విడుదల

గుంటూరు జిల్లా జైలులో 40 రోజులుగా రిమాండ్‌లో

గుంటూరు, జూలై 1(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ మంగళవారం బెయిల్‌పై విడుదలయ్యారు. టీడీపీ కార్యకర్తపై దాడి, హత్యాయత్నం కేసులో ఆయనకు గుంటూరు జిల్లా కోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది. గత మే నెలలో రాజధానిలోని ఉద్దండరాయునిపాలెంలో నందిగం సురేష్‌, ఆయన భార్య బేబీలత, సురేష్‌ సోదరుడు వెంకయ్య అలియాస్‌ వెంకటేశ్‌, మరో ఏడుగురు అనుచరులు టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడికి పాల్పడి, హత్యాయత్నం చేశారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైంది. నందిగం సురేష్‌ను పోలీసులు మే 19న అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌ విధించారు. దీంతో గత 40 రోజులుగా ఆయన గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. సురేష్‌ భార్య బేబీలతకు కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో వాయిదా ఉండటంతో మంగళవారం ఉదయం మంగళగిరి కోర్టుకు హాజరైన నందిగం సురేష్‌... రాత్రికి గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు.

Updated Date - Jul 02 , 2025 | 04:17 AM