బ్రహ్మోత్సవాల్లో నంది రాజసం
ABN , Publish Date - Feb 26 , 2025 | 11:45 PM
శివుడి వాహనం నంది. శ్రీగిరిలో మాఘంలో వచ్చే మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

శ్రీశైలం (కోడుమూరు రూరల్), ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): శివుడి వాహనం నంది. శ్రీగిరిలో మాఘంలో వచ్చే మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సుమారు 11 రోజులపాటు మల్లికార్జున సమేత బ్రమరాంభదేవి వేడుకలు తిలకించడానికి లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవార్లకు వివిధ సేవలను పురస్కరించుకుని ప్రత్యేక అలంకరణలో ఊరేగిస్తారు. వాహన సేవలలో మల్లన్న వాహనం నందీశ్వరుడు పల్లకి ముందు రాజసంగా నడుస్తుండగా వెనుకనే వివిధ కళారూపాలు ప్రదర్శనలు జరుగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఏడాదికోమారు వచ్చే స్వామి, అమ్మవార్ల కల్యాణంలో నందివాహనం ప్రధాన భూమిక పోషిస్తోంది. స్వామి సేవకుడిగా మల్లన్న పెళ్లి క్రతువులో నందిరాజసం మహా అద్భుతం.