ఇష్టపడి చదవాలి: డీఈవో
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:24 AM
ఇష్టపడి చదివి భవిష్యత కు బంగారు బాట వేసుకోవాలని డీఈవో జనార్దనరెడ్డి సూచించారు.

రుద్రవరం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : ఇష్టపడి చదివి భవిష్యత కు బంగారు బాట వేసుకోవాలని డీఈవో జనార్దనరెడ్డి సూచించారు. బుధవారం ఉదయాన రుద్రవరం జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో పదో తరగతి స్టడీ అవర్స్ క్లాసులను పరిశీలించారు. విద్యార్థులను ఏఏ ఛాప్టరుకు ఎలా చదువుతున్నారని ప్రశ్నించారు. ఉపాధ్యాయులను ఏఏ ఛాప్టరు విద్యార్థులకు ఎలా బోఽధించారని అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుడే విద్యార్ధికి దిక్సూచిలా ఉండి విద్యాబోధన చేయాలన్నారు. పదోతరగతిలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యా యులు బోధించాలన్నారు. అనంతరం పాఠశాల భవనాలను పరిశీలిం చారు. డీఈవోను పూలమాల శాలువాతో ఉపాధ్యాయులు సన్మానిం చారు. కార్యక్రమంలో ఎంఈఓ వీరరాఘవయ్య, హెచఎం సుబ్బరాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.