MP Kalisetti: సైకిల్‌పై ‘యోగాంధ్ర’కు ఎంపీ కలిశెట్టి
ABN , Publish Date - Jun 21 , 2025 | 06:22 AM
విశాఖలో శనివారం జరిగే ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శ్రీకాకుళం నుంచి సైకిల్‌పై బయల్దేరారు.
విశాఖలో శనివారం జరిగే ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శ్రీకాకుళం నుంచి సైకిల్‌పై బయల్దేరారు. శుక్రవారం ఉదయం అరసవల్లి శ్రీసూర్యనారాయణ సన్నిధిలో సన్నిహితులతో కలసి సూర్య నమస్కారాలు చేశారు. అనంతరం సైకిల్ ర్యాలీని ప్రారంభించి.తాను కూడా సైకిల్‌పై విశాఖ బయల్దేరారు. ‘యోగాంధ్ర’ విజయవంతం కావాలని ఆదిత్యుని సన్నిధి నుంచి సైకిల్ ర్యాలీ ప్రారంభించాననని ఎంపీ చెప్పారు.
- శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి