Share News

Minister Vasamshetty Subhash: వర్సిటీల సహకారంతో పరిశ్రమల్లో భద్రత

ABN , Publish Date - Aug 05 , 2025 | 06:03 AM

రాష్ట్రంలో పారిశ్రామిక భద్రతకు, ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తున్నామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ అన్నారు.

Minister Vasamshetty Subhash: వర్సిటీల సహకారంతో పరిశ్రమల్లో భద్రత

  • కార్మికుల్లో నైపుణ్యాల పెంపునకు కృషి: మంత్రి సుభాశ్‌

అమరావతి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పారిశ్రామిక భద్రతకు, ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తున్నామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ అన్నారు. కార్మికుల్లో నైపుణ్య సామర్థ్యాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ మేరకు అవసరమైన విధాన రూపకల్పన, పరిశోధనలను ముందుకు తీసుకెళ్లేందుకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ), జేఎన్‌టీయూ అనంతపురం, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీ్‌సతో సోమవారం అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్టు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో లేబర్‌ కమిషనర్‌ ఎం శేషగిరిబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2025 | 06:03 AM