Share News

Crop Damage: వరిని మింగిన మొంథా

ABN , Publish Date - Nov 05 , 2025 | 06:31 AM

తర్వాతి స్థానంలో పత్తి.. మొక్కజొన్న మరింతగా పెరిగిన నష్టం అంచనాలు మొత్తంగా.....

Crop Damage: వరిని మింగిన మొంథా

అత్యధికంగా నేలకొరిగిన వరి పైరు 1,29,635 హెక్టార్లలో రైతన్నలకు దెబ్బ

తర్వాతి స్థానంలో పత్తి.. మొక్కజొన్న మరింతగా పెరిగిన నష్టం అంచనాలు మొత్తంగా 1,57,941 హెక్టార్లలో నష్టం తుఫాను బాధిత రైతులు 3,10,784 మంది అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంట నష్టం అంచనా మంగళవారానికి మరింత పెరిగింది. మొంథా తుఫాన్‌ వల్ల రాష్ట్రవ్యాప్తంగా 1,38,391 హెక్టార్లలో పంటలు నీట మునిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేయగా, ఆరు రోజుల ఎన్యూమరేషన్‌లో ఈ నష్టం 1,57,941 హెక్టార్లకు పెరిగినట్టు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. మొత్తంగా 3,10,784 మంది రైతులు నష్టపోయినట్లు నిర్ధారించామన్నారు. కాగా, వరి పండించిన రైతులకే ఎక్కువగా నష్టం జరిగిందని 1,29,635 హెక్టార్లలో వరి నీట మునిగడం, వాలిపోవడం వంటివి జరిగాయన్నారు. తర్వాతి స్థానాల్లో పత్తి, మొక్కజొన్న పంటలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలా వారీగా కోనసీమలో 29,554, కృష్ణాలో 27,613, కాకినాడలో 21,301, తూర్పుగోదావరిలో 14,990, ప్రకాశంలో 12,347, బాపట్లలో 11,772, నంద్యాలలో 11,454, పశ్చిమగోదావరిలో 8,861, ఏలూరులో 5,559, ఎన్టీఆర్‌ జిల్లాలో 4,900, గుంటూరులో 2,059, కడపలో 1,756, పల్నాడులో 1,719, శ్రీకాకుళం జిల్లాలో 1,428 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు. పంట నష్టపోయిన రైతుల జాబితాలపై అభ్యంతరాలు, విజ్ఞప్తులను రైతు సేవా కేంద్రాల్లో స్వీకరిస్తున్నట్టు తెలిపారు.

Updated Date - Nov 05 , 2025 | 06:31 AM