ఉమ్మడి సర్వీసు రూల్స్ ఏర్పాటు చేయాలి: పీఆర్టీయూ
ABN , Publish Date - Apr 26 , 2025 | 04:40 AM
ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూర్చే ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలుపై సీఎం చంద్రబాబును పీఆర్టీయూ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బి.మోహనరెడ్డి నేతృత్వంలో నాయకులు సచివాలయంలో సీఎంను కలిశారు.
విజయవాడ(గవర్నర్ పేట), ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉమ్మడి సర్వీసు రూల్స్ ఏర్పాటు చేసి అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని పీఆర్టీయూ మాతృసంఘ తెలంగాణా నాయకులు, మాజీ ఎమ్మెల్సీ బి.మోహనరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు. డెమొక్రటిక్ పీఆర్టీయూ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ డి.శ్రీను, ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు, తెలంగాణా పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు పి.వెంకటరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..