Share News

MLC Elections: ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:14 AM

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. గుంటూరు-కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

MLC Elections: ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు

రాష్ట్రంలో 3 స్థానాలకు షెడ్యూల్‌ విడుదల

10 వరకు నామినేషన్లకు గడువు

ఆయా జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి

అమరావతి, న్యూఢిల్లీ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. గుంటూరు-కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 3న ఎన్నికలకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువుగా నిర్ణయించింది. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన కాగా, 13 వరకు నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు. ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌, మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. కాగా, తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.


మరిన్నీ తెలుగు వార్తల కోసం..

Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే

Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్

Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు

Also Read: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం

Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 30 , 2025 | 04:14 AM