Share News

పట్టభద్రుల తీర్పులో కొత్త కోణం

ABN , Publish Date - Mar 06 , 2025 | 12:30 AM

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో విజయం సాధించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఉభయ జిల్లాలో ఒకే ఒరవడి ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో భిన్నాభిప్రాయాలు చోటు చేసుకుంటాయి.

పట్టభద్రుల తీర్పులో కొత్త కోణం
ఏలూరులో పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తులతో కలిసి నామినేషన్‌ వేసేందుకు ర్యాలీగా వస్తున్న మంత్రులతోపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజా ప్రతినిధులు, నాయకులు (ఫైల్‌)

ఉమ్మడిగా కదిలారు.. కదిలించారు

వైసీపీ సహా ఇతరుల ఊహలు తల్లకిందులు

పేరాబత్తుల గెలుపుతో కూటమిలో ఉత్తేజం

ఎమ్మెల్సీ ఎన్నికల సరళిపై అధినాయకత్వం సంతృప్తి

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో విజయం సాధించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఉభయ జిల్లాలో ఒకే ఒరవడి ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో భిన్నాభిప్రాయాలు చోటు చేసుకుంటాయి. తర్జనభర్జనలు సాగు తాయి. రాజకీయాల్లో ఎత్తులు, పైఎత్తులు, సామాజిక అంశాలు ఒకదాని వెంట మరొకటి పరుగులు తీస్తాయి. అయినా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతలంతా ఉమ్మడిగా కేడర్‌ను, ఓటరును కలిపి విజయం దక్కించుకోగలిగారు.

పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ గెలుపు కూటమిలో కొత్త జోష్‌ను నింపింది. ఈఎన్నికలు ఒక దశలో కూటమి ప్రభుత్వానికి కొత్త సవాల్‌గానే కనిపించింది. సాధారణ రాజకీయాలు మాదిరిగా కాకుండా పట్టభద్రులందరినీ కూడదీసి పార్టీకి అనుకూలంగా రంగంలోకి దింపి చివరికి వారంతా తమకే మద్దతు ఇచ్చేలా ఒప్పించి, మెప్పించి ఓటింగ్‌ సాధించాలి. ఈ క్రమంలోనే తొలిసారిగా ఈ తరహా నియోజక వర్గంలో పార్టీ అభ్యర్థిని కూటమి రం గంలోకి దింపింది. ఈ నిర్ణయం కూట మిలో అనేక సవాళ్లకు దారితీసింది. ప్రతిపక్షాల్లో ఉన్న మిగతా వారికి పెను సవాల్‌ను విసిరించింది. పట్టభద్రుల ఓటర్ల నియోజకవర్గంలో ప్రతీ ఐదేళ్లకోసారి ఓటర్ల నమోదు కొన సాగాలి. దీనిలోను కూటమి జాగ్రత్తపడింది. నియోజక వర్గాల వారీగా సీనియర్లతో సంప్రదింపులు జరిపారు. ఒక దశలో ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షా 23 వేల మందికి పైగా ఓటర్లు మాత్రమే జాబితాలో చేరారు. దీంతో పట్టభద్రులను ఓటర్లుగా చేర్పించే వ్యూహం రచించి ఆ బాధ్యతను పార్టీ నియోజకవర్గ కన్వీనర్లకు, సీనియర్లకు, పార్టీ జిల్లా అధ్యక్షులకు, మంత్రులకు అప్పగిస్తూ అధి ష్ఠానం పరీక్ష పెట్టింది. ఓటర్ల సంఖ్య పెరగాల్సిందే తప్ప గతంకంటే తగ్గుదల ఉండకూడదని సీఎం చంద్రబాబు స్వయంగా ఆదేశాలు ఇచ్చారు. ఒక్క టీడీపీయే కాకుండా కూటమి భాగస్వా మ్య పక్షాలైన బీజేపీ, జన సేనను సైతం సమాతరంగా కదిపారు. నియోజకవర్గాల్లో ఆయా పార్టీల ఎమ్మెల్యేలకు ఏరోజుకారోజు ఓటర్ల చేరికలో పురో గతిని పరిశీలించే బాధ్యతను అప్పగించారు. వీరితోపాటు నియో జకవర్గ పరిశీలకులను రంగంలోకి దింపారు. అంతే ఓటర్ల సంఖ్య కాస్తా మూడు లక్షలకు పైగా దూసుకెళ్లింది.

ఉమ్మడిగా కదిలి పట్టభద్రులను ఒప్పించి..

తెలుగుదేశం కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసాంతం ప్రయత్నించారు. ఈ బాధ్యతను ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం పూర్తిగా స్వీకరించారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి ఒకవైపు, ఎమ్మెల్యేలు ఇంకోవైపు పార్టీ పరిశీలకులు మూడోవైపు నియోజకవర్గాల్లో రోజువారీగా సమీక్షించగలి గారు. మరోవైపు పోటీలో ఉన్న అభ్యర్థులు ఏఏ ప్రాంతా ల్లో ఎంతెంత సంఖ్యలో పట్టభద్రులను ఆకట్టుకోగలిగారో ఆరా తీశారు. జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మంతెన రామరాజు ఈ విషయంలో చొరవ తీసుకు న్నారు. పీడీఎఫ్‌ అభ్యర్థి వీరరాఘవులు వైపే ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారని ఒకదశలో ప్రచారం సాగింది. దీనిని గమనించి ఓటర్ల జాబితాలోని ఉద్యోగులతోను సంప్రదించి మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించి సఫలమ య్యారు. మొత్తంగా ఉమ్మడిగా అందరినీ కూడగట్టుకున్న ఫలితంగానే టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ ఆధిక్యతతో గెలుపొందగలిగారు. వైసీపీతో పాటు మిగతా పక్షాలు తెలుగుదేశం ఓటమి పాలైతే ఆ మేరకు లబ్ధి పొందవచ్చన్న ఊహలకు పట్టభద్రులే చెక్‌ పెట్టినట్ట య్యింది. దీనికితోడు ఉభయ గోదావరి జిల్లాల్లో నేతలంతా ఎక్కడా వివాదాలు లేకుండా సమయస్ఫూర్తితో గెలుపే లక్ష్యంగా ఉమ్మడిగా పని చేయడం, గత సాధారణ ఎన్నికల కంటే అత్యధికంగానే పనిచేసినట్టయ్యింది.

Updated Date - Mar 06 , 2025 | 12:30 AM